• facebook
  • whatsapp
  • telegram

బాలికలకు ఉపకారవేతనాలు

నియామకాల, శిక్షణల వేదిక ఇంటర్న్‌శాల బాలికల కోసం వార్షిక స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. ‘ఇంటర్న్‌శాల కెరియర్‌ స్కాలర్‌షిప్‌ (ఐసీఎస్‌జీ) - 2022’గా వ్యవహరించే ఈ అవార్డు కింద ఏడాదికి రూ.25,000 చెల్లిస్తారు. 

విద్య, క్రీడలు, కళలు, ఇతర ఏ రంగంలోనైనా తమ కలలను సాకారం చేసుకోవడంలో అడ్డంకులను ఎదుర్కొంటోన్న అమ్మాయిలు ఇంటర్న్‌శాల ఉపకారవేతనానికి అర్హులు. ఇంటర్న్‌షిప్‌ చేస్తోన్న, ఎంచుకున్న రంగంలో ప్రాజెక్టును నిర్వహిస్తోన్న వారు తమ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో చెల్లింపులకు, ప్రత్యేక పరికరాల కోసం ఉపయోగపడేలా ఈ అవార్డును అందజేస్తారు. 

డిసెంబరు 31, 2021 నాటికి 17-23 ఏళ్ల మధ్య ఉన్న బాలికలు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేది జనవరి 15, 2022. దరఖాస్తులో వృత్తిపరమైన ఆశయాలను కూడా స్పష్టంగా తెలియజేయాలి. దరఖాస్తులను అవరోధాలను ఎదుర్కోవడంలో చేసిన పోరాటం, సాధించిన విజయాలు, ఉద్దేశం, అవసరాలు... అనే నాలుగు అంశాల ఆధారంగా ఉపకార వేతనాల అర్హులను ఖరారు చేస్తారు. 

గత ఏడాది విజేత...

వృత్తిలో స్థిరపడే క్రమంలో అవరోధాలు, కష్టాలను ఎదుర్కొంటోన్న బాలికలకు ఇంటర్న్‌శాల ఈ స్కాలర్‌షిప్‌ ద్వారా సాయపడుతోంది. ఐసీఎస్‌జీ-2021 విజేత స్నేహా శంకర్‌. బెంగళూరు (కర్ణాటక)కు చెందిన బీకామ్‌ తృతీయ సంవత్సర విద్యార్థిని. ఈమె 12 ఏళ్లకే తండ్రిని కోల్పోయింది. దాంతో స్నేహ, ఆమె తల్లికి ఎలాంటి ఆర్థిక సాయం లేకపోయింది. చదువులో చూపిన ప్రతిభ కారణంగా పాఠశాల, కళాశాలల యాజమాన్యాల నుంచి ఆర్థిక సహాయం అందుకుంది. ఆ తర్వాత ట్యూషన్లు చెప్పడమూ మొదలుపెట్టింది. ఈ ఆదాయంతో చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌ కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంటర్న్‌శాల నుంచి పొందిన స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని కళాశాల ఫీజుకు వినియోగించింది.

దరఖాస్తు ప్రక్రియలో మూడు దశలు

1. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

2. టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ కోసం ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటించి.. వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు ముందే సంబంధిత డాక్యుమెంట్లు, రుజువులను సమర్పించాల్సి ఉంటుంది.

3. ఇంటర్వ్యూ తర్వాత వెరిఫికేషన్‌ కోసం అభ్యర్థులు దరఖాస్తులో సూచించిన రిఫరీని సంప్రదిస్తారు. ఆ తర్వాతే అభ్యర్థి తుది ఎంపిక ఉంటుంది. 

ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలకూ, దరఖాస్తుకూ సందర్శించాల్సిన వెబ్‌సైట్‌: https://bit.lyCSG-22
 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ క్లాట్‌ మార్గంలో నాణ్యమైన న్యాయవిద్య!

‣ బీస్కూల్స్‌ ప్రవేశానికి మ్యాట్‌

‣ ఆశావహ ధోరణితో అనుకూల ఫలితాలు

‣ జట్టుగా.. కలిసికట్టుగా!

‣ ఏ బోర్డులో చదివితే గెలుపు సులువు?

Posted Date: 05-01-2022


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం