• facebook
  • whatsapp
  • telegram

సోనూసూద్‌ స్కాలర్‌షిప్పులు

విదేశాల్లో చదివే వైద్య విద్యార్థులకు రూ. 5 లక్షల సాయం

విదేశీ వైద్యవిద్య అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్నది. పేద, మధ్యతరగతి వారికి ఇది అందని మానిపండనే చెప్పవచ్చు. ఇలాంటివారు తమ కలలు నిజం చేసుకునేందుకు సుప్రసిద్ధ నటుడు సోనూసూద్‌ ఉపకార వేతనాలను అందించటానికి ముందుకొచ్చారు!

ఐఎస్‌ఎం ఎడ్యుటెక్‌ సంస్థతో కలిసి సోనూసూద్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ఇటీవలే ప్రారంభించారు. కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, తజకిస్తాన్‌లలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్‌ చదవాలనుకుంటున్న విద్యార్థులు ఉపకార వేతనాల కోసం https://sonuism.org/ పోర్టల్‌లో డిసెంబరు 15 లోగా  దరఖాస్తు చేసుకోవలసివుంటుంది.

కిర్గిస్తాన్‌లో ఇంటర్నేషనల్‌ హయ్యర్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఐఎస్‌ఎం- ఐయూకే), కజకిస్తాన్‌లో కజక్‌ రష్యన్‌ మెడికల్‌ యూనివర్సిటీ, జార్జియాలో ఈస్ట్‌ యూరోపియన్‌ యూనివర్సిటీ, జార్జియన్‌ అమెరికన్‌ యూనివర్సిటీ, ఇంకా మరో ఆరు వర్సిటీల్లో చదవాలనుకుంటున్న విద్యార్ధులు పోర్టల్‌లోని అప్లికేషన్‌ ద్వారా ద]రఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. దరఖాస్తు చేసుకున్నవారికి ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహించి అందులో ప్రతిభ చూపిన విద్యార్ధులకు వారు కోరిన విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు 5 లక్షల రూపాయిల చొప్పున స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ఐఎస్‌ఎం ఎడ్యుటెక్‌ ఫౌండర్, ఛైర్మన్‌ డాక్టర్‌ ఫణిభూషణ్‌ తెలిపారు.
 

Posted Date: 03-12-2020


 

తాజా కథనాలు

మరిన్ని