• facebook
  • whatsapp
  • telegram

‘స్టెమ్’‌లో మ‌హిళా భాగ‌స్వామ్యం పెంచేలా.. !

‣ విద్యార్థినుల‌కు బ్రిటిష్ కౌన్సిల్ స్కాల‌ర్‌షిప్‌లు

మీరు మీ అధ్యయనం పట్ల ఆస‌క్తి చూపే సైన్స్, టెక్నాల‌జీ, ఇంజినీరింగ్, మ్యాథ‌మెటిక్స్(స్టెమ్) సబ్జెక్టుల్లో డిగ్రీ పొందిన మ‌హిళా విద్యార్థా..?  ఉన్నత విద్య కోసం విదేశాల వైపు చూస్తున్నారా..?  అయితే ప్రముఖ ఇంగ్లండ్ విశ్వవిద్యాలయంలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత ప్రోగ్రాముల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ అధ్యయనం చేయడానికి మీరు స్కాలర్‌షిప్ పొందవచ్చు. అమెరికా, దక్షిణ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియా మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో బ్రిటిష్ కౌన్సిల్ 19 ఇంగ్లండ్ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్టెమ్ నేపథ్యం ఉన్న మహిళలకు ఆర్థిక సహాయం అందించి, వారు వృత్తిని కొనసాగించడానికి కౌన్సిల్ చేయూత‌నందించ‌నుంది. దీంతో భ‌విష్య‌త్ తరాల విద్యార్థినులను స్టెమ్ వైపు అడుగులు వేయించేందుకు కృషి చేస్తోంది. 

ఎందుకీ స్కాలర్‌షిప్ కార్యక్రమం..?
ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం విద్యార్థినులు, మహిళలకు స్టెమ్‌లో అవకాశాలను పెంచేందుకు ఉద్దేశించ‌బ‌డింది. యూఎన్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో) స‌ర్వే ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో 30 శాతం కంటే తక్కువ మంది మహిళలు, 30 శాతం మంది విద్యార్థినులు మాత్రమే ఉన్నత విద్యలో స్టెమ్ సంబంధిత రంగాలను ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం(మూడు శాతం), సహజ విజ్ఞాన శాస్త్రం, గణితం, గణాంకాలు(ఐదు శాతం), ఇంజినీరింగ్, తయారీ, నిర్మాణం (ఎనిమిది శాతం)లో మహిళా విద్యార్థుల నమోదు చాలా తక్కువగా ఉంది.  దీంతో వారిని ఈ రంగాల వైపు తీసుకెళ్లేందుకు బ్రిటిష్ కౌన్సిల్ చొరవ తీసుకుంది. ఈ ఏడాది బ్రిటిష్ కౌన్సిల్ సౌజ‌న్యంతో స్ట్రాత్‌క్లైడ్ విశ్వ‌విద్యాల‌యం దక్షిణాసియాకు చెందిన విద్యార్థినుల కోసం Energy Transition(శక్తి పరివర్తనం) రంగంలో మాస్టర్స్ అధ్యయనం చేయటానికి ఐదు స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, శ్రీలంకకు చెందిన మహిళా విద్యార్థులు ఈ స్కాల‌ర్‌షిప్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ద‌ర‌ఖాస్తు వివ‌రాలివీ... 
* భార‌తీయ విద్యార్థినుల‌కు కేటాయించిన స్కాల‌ర్‌షిప్‌లు
: 1
* ప‌రిధిలోకి వ‌చ్చే ఫీజులు: చ‌దువుకు సంబంధించిన అన్ని ఫీజులు(ట్యూషన్, నెలవారీ ఉప‌కార వేత‌నం, రిటర్న్ ఎకానమీ క్లాస్ టిక్కెట్, ఐఈఎల్‌టీఎస్ పరీక్ష ఫీజు, వీసా అప్లికేషన్, స్టడీ మెటీరియల్స్ త‌దితర ఖ‌ర్చులు)

కోర్సు: ఫుల్‌టైమ్ కోర్సు(2021-2022)
* ద‌ర‌ఖాస్తు గ‌డువు: మార్చి 2021
* అర్హ‌త‌లు: స్టెమ్ స‌బ్జెక్టుల్లో డిగ్రీ. (విద్యార్థినుల‌కు మాత్ర‌మే)
* పాస్‌పోర్టుతోపాటు దేశంలో శాశ్వత చిరునామా క‌లిగి ఉండాలి.
* పైన పేర్కొన్న విధంగా స్ట్రాత్‌క్లైడ్ విశ్వవిద్యాలయ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ఒకదానిపై అధ్యయనం చేయడానికి దరఖాస్తు సమర్పించాలి.

స్కాలర్‌షిప్‌​న‌కు కింది కార్యక్రమాలు అర్హ‌మైన‌వి:
* అడ్వాన్స్డ్ కెమికల్ ఇంజినీరింగ్
* అడ్వాన్స్డ్ మెకానికల్ ఇంజినీరింగ్
* అడ్వాన్స్డ్ మెకానికల్ ఇంజినీరింగ్(ఎనర్జీ సిస్టమ్స్)
* అడ్వాన్స్డ్ మెకానికల్ ఇంజినీరింగ్(ఇండ‌స్ట్రియల్ ప్లేస్‌మెంట్)
* అడ్వాన్స్డ్ మెకానికల్ ఇంజినీరింగ్(పవర్ ప్లాంట్ టెక్నాలజీ)
* ఎలక్ట్రికల్ పవర్ అండ్ ఎనర్జీ సిస్టమ్స్
* ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్
* ఎనర్జీ సిస్టమ్స్ ఇన్నోవేషన్
* ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ
* స్మార్ట్ గ్రిడ్లు
* సబ్సీ, పైప్‌లైన్ ఇంజినీరింగ్
* సస్టైనబుల్ ఇంజినీరింగ్; కెమికల్ ప్రాసెసింగ్
* సస్టైనబుల్ ఇంజినీరింగ్; ఆఫ్షోర్ రెన్యూవబుల్ ఎనర్జీ
* సస్టైనబుల్ ఇంజినీరింగ్; పునరుత్పాదక శక్తి వ్యవస్థలు, పర్యావరణం
* విండ్ ఎనర్జీ సిస్టమ్స్

Posted Date: 17-12-2020


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం