• facebook
  • whatsapp
  • telegram

విద్యార్థినులకు ‘ఉన్నతి’ ఉపకారం

రోల్స్ రాయిస్‌ స్కాలర్ షిప్‌లు

అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి దేశ సమగ్ర ప్రగతికి దోహదం చేస్తుందని అందరూ గుర్తించిన అంశమే. అందుకే ప్రతిభావంతులైన విద్యార్థినులు ఆర్థిక అవరోధాల వల్ల ఆగిపోకుండా, ఉన్నత చదువులను కొనసాగించే విధంగా సాయం చేసేందుకు బ్రిటన్ కేంద్రంగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ సంస్థ స్కాలర్ షిప్‌ల‌ను అందిస్తోంది. ఇలాంటి ఆర్థిక వెసులుబాటు చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణలకు ఆధారం కావచ్చనే నమ్మకమే ఈ ప్రోత్సాహానికి పునాది. 

విలాసవంతమైన కార్లు, ఇతర ఉత్పత్తులకు ప్రపంచ ఖ్యాతి పొందిన రోల్స్ రాయిస్ సంస్థ బ్రిటన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మహిళా సాధికారత సాధనకు చేయూతగా, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇంజినీరింగ్ విద్యార్థినులకు ఉపకారవేతనాలను అందిస్తోంది. ‘ఉన్నతి’ పేరుతో అందించే ఈ స్కాలర్ షిప్ గ‌తేడాది నుంచి కొన‌సాగిస్తోంది. రోల్స్ రాయిస్ సంస్థ చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (సీఏఎఫ్) ఇండియా, మరో సంస్థ సంయుక్త సహకారంతో దీన్ని నిర్వహిస్తోంది. ఉపకారవేతనం కింద రూ.35,000 ఆర్థిక సహాయం అందిస్తారు. 

ఎవ‌రు అర్హులు?

ఏరోస్పేస్, మెరైన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ తదితర బ్రాంచీలతో ఇంజినీరింగ్ డిగ్రీ చేస్తున్న ఒకటి, రెండు, మూడు సంవత్సరాల విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగో ఏడాది చదువుతున్నవారికి అవకాశం లేదు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ అంశాలపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్స‌హించ‌డమే ఈ ప్రోగ్రాం ప్ర‌ధాన ఉద్దేశం. దరఖాస్తుదారులు ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థలో చదువుతూ ఉండాలి. పదోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్‌ బోర్డు పరీక్షల్లో 60% కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. 

ద‌ర‌ఖాస్తు విధానం

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాలి. ఫొటో గుర్తింపు కార్డు, చిరునామా ధ్రువ‌ప‌త్రం, 10వ త‌ర‌గ‌తి/ ఇంట‌ర్మీడియ‌ట్ మెమో (స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం), కాలేజీ అడ్మిష‌న్ ధ్రువ‌ప‌త్రం (కళాశాల ఐడీ కార్డు / ప్రవేశ రుసుము రసీదు), ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజు రసీదు, విద్యార్థిని‌ బ్యాంక్ ఖాతా వివరాలను సిద్ధం చేసుకొని దరఖాస్తు చేయాలి.  

ఎంపిక ఎలా?

స్కాలర్ షిప్ ల కోసం విద్యార్థినుల ఎంపిక ప్ర‌క్రియ వివిధ ద‌శ‌ల్లో జ‌రుగుతుంది. కనీస విద్యార్హత ముందు తరగతి అక‌డ‌మిక్ వివ‌రాలు, కుటుంబ ఆదాయం, పర్సంటైల్ ర్యాంకింగ్‌ను క్షుణ్ణంగా అంచనా వేసి వివిధ‌ ద‌శ‌ల ఆధారంగా అభ్య‌ర్థినులను ఎంపిక చేస్తారు. 

విద్యార్థినుల ఆర్థిక అవసరాలు, అక‌డ‌మిక్ మెరిట్ ఆధారంగా స్క్రీనింగ్.

షార్ట్ లిస్టింగ్ చేసిన అనంత‌రం టెలిఫోనిక్ ఇంటర్వ్యూ.

తుది ఎంపిక కోసం ముఖాముఖి (అవ‌స‌ర‌మైతే).

ద‌ర‌ఖాస్తుకు  చివరి తేదీ; మార్చి 31, 2021 

వెబ్‌సైట్‌: https://www.buddy4study.com/page/rolls-royce-unnati-scholarships-for-women-engineering-students

Posted Date: 26-03-2021


 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం