• facebook
  • whatsapp
  • telegram

అమ్మాయిలూ... మీ కోసమే!

నచ్చిన రంగంలో రాణించాలనుకునే అమ్మాయిలకు ఇంటర్న్‌శాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. ‘ఇంటర్న్‌శాల కెరియర్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ గర్ల్స్‌’ (ఐసీఎస్‌జీ) పేరిట వీటిని అందిస్తోంది. 17 నుంచి 23 ఏళ్లలోపు అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇంటర్న్‌షిప్, శిక్షణల వేదిక ఇంటర్న్‌శాల ఏటా ఇంటర్న్‌శాల కెరియర్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ గర్ల్స్‌ పేరిట అమ్మాయిలకు ఉపకార వేతనాలను అందిస్తోంది. 2021కిగానూ సంబంధిత ప్రకటనను విడుదల చేసింది. అవరోధాలను ఎదుర్కొని తమకు నచ్చిన కెరియర్‌ను ఎంచుకుని, రాణించాలనుకునే అమ్మాయిలకు దీన్ని అందజేస్తారు. విద్యాసంబంధ, క్రీడలు, ఆర్ట్స్, ఇతర ఏ రంగాలవారైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

స్కాలర్‌షిప్‌ మొత్తం రూ.25,000. ఈ మొత్తాన్ని ఇంటర్న్‌షిప్‌ చేయటానికి గానీ, ఎంచుకున్న రంగంలో ప్రాజెక్ట్‌కు అలవెన్సుగా లేదా స్పెషలైజ్‌డ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్, స్పెషల్‌ ఎక్విప్‌మెంట్‌ మొదలైన రూపంలో అందిస్తారు. 

డిసెంబరు 31, 2020నాటికి 17 నుంచి 23 ఏళ్ల మధ్యగల అమ్మాయిలు (భారతీయులై ఉండాలి) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నాలుగు అంశాలు- వారు ఎదుర్కొన్న సవాళ్లు (ఆర్థిక, సామాజిక, శారీరక, ఇతర ఏవైనా), సాధించిన విజయాలు (ఎంచుకున్న రంగంలో గుర్తించదగ్గది), ఉద్దేశం (స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని దేనికి ఉపయోగిస్తారనేది), అవసరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్కాలర్‌షిప్పుల విషయంలో పరిమితేమీ లేదు. అర్హులని భావించిన వారందరికీ అందజేస్తారు. 

దరఖాస్తు గడువు: జనవరి 15, 2021. 

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

ఆన్‌లైన్‌: వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు సమర్పణ

ఇంటర్వ్యూ: ఎంపిక చేసినవారిని ముందుగా అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించమని అడుగుతారు. ఆపై టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

రిఫరీ చెక్‌: ఫారంలో రిఫరీని పేర్కొనాల్సి ఉంటుంది. ఆ పేర్కొన్న వారిని వెరిఫికేషన్‌ నిమిత్తం సంప్రదిస్తారు. తర్వాత తుది విజేతను ఎంపిక చేసి, స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. 

వివరాలకు: https://www.buddy4study.com/scholarship/internshala-career-scholarship-for-girls-icsg

Posted Date: 05-01-2021


 

తాజా కథనాలు

మరిన్ని