• facebook
  • whatsapp
  • telegram

లక్ష్యంతో చదవాలి!

* లాసెట్ 2014 (5 సంవత్సరాలు) ప్రథమ ర్యాంకర్ గంగాధర్.

నిర్మల్ గ్రామీణం, న్యూస్‌టుడే: ఏ పరీక్షకు సిద్ధమైనా లక్ష్యంతో, ఏకాగ్రతతో చదవాలంటున్నారు లాసెట్ 2014 (5 సంవత్సరాలు) ప్రథమ ర్యాంకర్ వన్నెల గంగాధర్. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఈ ర్యాంకును అందుకున్న గంగాధర్ గ్రూప్స్ సాధనే లక్ష్యంగా కృషిచేసున్నారు. ఈ సందర్భంగా 'న్యూస్‌టుడే' అతడిని పలుకరించింది. ఆ వివరాలు....

* కుటుంబ నేపథ్యం

వన్నెల గంగాధర్ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం ముజ్గి గ్రామానికి చెందిన నివాసి. తల్లిదండ్రులు గంగవ్వ, లింగన్న. వీరిది మధ్య తరగతి కుటుంబం. వీరికి గంగాధర్ ఏకైక కుమారుడు. వ్యవసాయమే వీరి ప్రధాన వృత్తి. తండ్రి ఏడాది క్రితమే మృతి చెందారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివినప్పుడు గంగాధర్ ఒక విషయంలో అనుత్తీర్ణతను పొందారు. తండ్రి ప్రోత్సాహంతో తిరిగి ఆ విషయంలో పరీక్ష రాసి ఉత్తీర్ణతను సాధించారు. అప్పటి నుంచి తండ్రి మాటలను ప్రేరణగా తీసుకుని నిర్మల్‌లోని జీఎస్సార్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి 1000 మార్కులకు 842 మార్కులను సాధించారు. డిగ్రీని స్థానిక చాణిక్య కళాశాలలో చదువగా 1200 మార్కులకు గాను 871 మార్కులను సాధించారు. అలాగే హైద్రాబాద్‌లోని నిజాం కళాశాలలో ఎంఎ కోర్సులో చరిత్ర విభాగంలో చేరారు. 74శాతం ఉత్తీర్ణతను కైవసం చేసుకున్నారు.

* ఇలా చదివారు

లా చేయాలనే ఆకాంక్షతో గంగాధర్ ముందుకు సాగారు. లాసెట్ ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు కావటంతో తన ప్రణాళికను రూపొందించుకున్నారు. గంగాధర్ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో శిక్షణ తీసుకోవాలంటే వేలాది రూపాయలు వెచ్చించ లేకపోయారు. నిరాశ చెందకుండా లా సెట్‌లో మంచి ఫలితాన్ని సాధించాలనే ఆశయాన్ని పెట్టుకున్నారు. రోజూ ఇంటివద్దనే సుమారు 5 నుంచి 6 గంటల పాటు ఏకాగ్రతతో చదివారు. అలాగే విజేతల పుస్తకాలను చదివి ప్రేరణ పొందేవారు.

* 30 రోజుల్లోనే....

ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు కావటంతో గంగాధర్ ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకున్నారు.. 30 రోజుల టార్గెట్‌గా తన ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇంటివద్దనే సిలబస్‌ను, స్టడీ మెటీరియర్‌లను, దినపత్రికలను అధ్యయనం చేసి నోట్స్ తయారుచేసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు తాజా అంశాలపై మంచి పట్టు సాధించారు. చదివేటప్పుడు ఎలాంటి ఆలోచనలు లేకుండా లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని చదవాలంటారు గంగాధర్. ఆ విధంగా చేస్తే తప్పకుండా విజయం వరిస్తుందంటారు. 30 రోజుల తన ప్రణాళికను దిగ్విజయంగా పూర్తి చేసి ఉత్తమ ఫలితాన్ని సాధించాన్నారు.

* గ్రూప్స్ సాధించటమే లక్ష్యం

గ్రూప్స్ సాధించటమే తన లక్ష్యమని గంగాధర్ పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకొంటున్నట్లు వివరించారు. గ్రూప్స్‌లో కూడ చక్కటి ఫలితాన్ని సాధించటమే తన ధ్యేయమనీ, కొత్తవారు, పరీక్షలకు సిద్ధమయ్యే వారు ఎవరైనా తమ పరీక్షపై పూర్తి ఏకాగ్రత పెడితే విజయం వరిస్తుందని చెప్పారు.

Posted Date: 02-11-2019