• facebook
  • whatsapp
  • telegram

ఇలా గెలిచా... ఇంజినీరింగ్‌ సర్వీస్‌!

ఐఐటియన్లకో, చిన్నప్పటినుంచీ ఇంగ్లిష్‌ మీడియం చదివిన నగర విద్యార్థులకు మాత్రమే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ సాధ్యమవుతుందనే అపోహలను తన ర్యాంకు ద్వారా బద్దలు కొట్టాడు అవులూరి శ్రీనివాసులు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ గ్రామీణ విద్యార్థి ఈఎస్‌ఈలో అఖిలభారత స్థాయిలో మూడో ర్యాంకులో నిలిచాడు. ఎందరికో ప్రేరణగా నిలిచే అతడి విజయప్రస్థానం తన మాటల్లోనే....

వూరు: నాగరాజుకుంట, కోనకనమిట్ల మండలం, ప్రకాశం జిల్లా.
పదో తరగతి: శ్రీ వివేకానంద హైస్కూలు, పొదిలి, 482/600 మార్కులు
ఇంటర్మీడియట్‌ (ఎంపీసీ): ఎస్‌వీ జూనియర్‌ కళాశాల, పొదిలి. 938/1000 మార్కులు
ఎంసెట్‌: 18,500 ర్యాంకు
బీ టెక్‌- (ఈసీఈ బ్రాంచి): ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాల, కందుకూరు
మార్కుల శాతం: 80
ఈఎస్‌ఈ: జాతీయస్థాయిలో 3వ ర్యాంకు

ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ తెలుగు మీడియంలోనే చదివాను. బీటెక్‌ మూడో సంవత్సరంలో ‘గేట్‌’ గురించి తెలిసింది. 2012లో ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ‘ఏస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ’లో చేరాను. 2013 నుంచి వరసగా గేట్‌ పరీక్ష రాస్తూ వచ్చాను. 2014లో 900, 2017లో 336 ర్యాంకులు వచ్చాయి. ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష గురించి హైదరాబాద్‌ వచ్చాకే - స్నేహితుల ద్వారా తెలిసింది. వాళ్ళు సంవత్సరాల తరబడి ఈ పరీక్ష కోసం కష్టపడి చదవటం చూశాను. ఇది ఇంజినీరింగ్‌లో అత్యుత్తమ సర్వీసు అని దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఈలోగా 2014లో డీఆర్‌డీఓలో జూనియర్‌ రిసర్చి ఫెలోగా చేరాను. నా ఇంగ్లిష్‌ పరిజ్ఞానం బీటెక్‌ ముగిశాకే పెంచుకున్నాను. డీఆర్‌డీఓలో ఉత్తర భారతీయలుండటం వల్ల తప్పనిసరిగా ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సివచ్చింది. మొదట్లో తప్పులు వచ్చేవి, తర్వాత ఆ లోపాలు తగ్గిపోయాయి. అలాగే ఇస్రో, బార్క్‌, ఏర్‌పోర్ట్‌ అథారిటీ, బెల్‌ ఇంటర్వ్యూలకు హాజరు కావటం వల్ల వాటిలో నెగ్గకపోయినా, నా ఆంగ్ల సామర్థ్యం మెరుగుపడింది.

2014-15లో ‘ఏస్‌’లో ఈఎస్‌ఈ కోచింగ్‌ తీసుకున్నాను. కోచింగ్‌కు అభ్యర్థి కృషి కూడా తోడవ్వాలి. 2014లో అర్హత పొందలేకపోయాను. తర్వాతి ఏడాది రెండంచెలు దాటాను కానీ, ఇంటర్వ్యూ వరకూ వెళ్ళలేకపోయా. 2016లోనూ అర్హత పొందలేకపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో 2017 పరీక్ష రాశాను. కానీ కచ్చితమైన ప్రణాళిక వేసుకోలేదు. ఆఫీసులో ఖాళీ ఉంటే చదువుకునేవాణ్ణి. గంట విరామం దొరికినా ప్రిపరేషన్‌ సాగించేవాణ్ణి. ప్రిలిమినరీకి తగినంత సమయం కేటాయించక, అనుకున్నంత కృషి చేయలేకపోయాను. అయినా నెగ్గాను. ఆపైన డీఆర్‌డీఓకు రాజీనామా చేసి 2-3 నెలలు మెయిన్స్‌ కోసం కష్టపడి చదివాను. మెయిన్స్‌ రాశాను. సివిల్స్‌ మాదిరి కాకుండా.. ఈఎస్‌ఈలో ప్రిలిమినరీ మార్కులను కూడా లెక్కిస్తారు. ప్రిలిమ్స్‌లో నాకు మంచి మార్కులకు అవకాశం లేదు కాబట్టి ఈ సంవత్సరం పరీక్ష నెగ్గకపోవచ్చని అనుకున్నాను. అందుకే వచ్చే సంవత్సరం కోసం సన్నద్ధత కూడా ఆరంభించాను. నెగ్గటమే కష్టమనుకున్నా కాబట్టి అఖిలభారత ర్యాంకు అస్సలు వూహించనేలేదు.

ఫలితాలు వచ్చిన రోజు.. సెప్టెంబరు 11 సాయంత్రం.. యూపీఎస్‌సీ వెబ్‌సైట్లో నా పేరు, మూడో ర్యాంకు చూసుకున్నపుడు నమ్మలేనంత ఆశ్చర్యం.. సంతోషంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు!

 

అనుకూలించిన మార్పులు..
2017లో సిలబస్‌ మారింది. మూడంచెల పరీక్షల నిర్వహణ తీరు కూడా మారింది. గతంలో ఈఎస్‌ఈని వ్యవధి లేకుండా వరసగా నిర్వహించేవారు. కానీ ఈ సంవత్సరం నుంచీ ప్రిలిమ్స్‌ను జనవరిలో, మెయిన్స్‌ను మేలో, ఇంటర్వ్యూను ఆగస్టులో నిర్వహించటం మొదలుపెట్టారు. దీంతో తగిన కృషి చేయటానికి వ్యవధి ఏర్పడింది. ఈఎస్‌సీ మార్కుల విషయంలో మన అంచనాలు తప్పుతుంటాయి. మెయిన్స్‌లో 300/600 మార్కులు వస్తాయని అనుకుంటే నా అంచనాలకు మించి 434/600 మార్కులు వచ్చాయి. ఇంటర్వ్యూలో బోర్డు సభ్యులు నా సమాధానాలకు సంతృప్తిపడ్డారు. 200 మార్కులకు 130 ఇస్తారని ఆశించాను. కానీ 116 మాత్రమే దక్కాయి. ఈఎస్‌ఈ నెగ్గటం సుదీర్ఘ ప్రక్రియ. రెండు మూడేళ్లు పడుతుంది. తెలుగు విద్యార్థులు ఏడాది గట్టిగా ప్రయత్నించి రాకపోతే నిరాశపడి వదిలేస్తారు. కానీ కనీసం రెండు సంవత్సరాల కృషి తప్పనిసరి అని గుర్తించాలి.

 

మంచి ర్యాంకు రావాలంటే...
ఈఎస్‌ఈలో సిలబస్‌ విస్తృతం. ఇంజినీరింగ్‌ టెక్నికల్‌ సబ్జెక్టుల్లో మౌలిక విషయాలపై (ఫండమెంటల్స్‌) పట్టు పెంచుకోవాలి. అంకితభావంతో నిరంతరం.. రెండేళ్ళ పాటు చదవాలి. ప్రిపరేషన్‌ గురించి పక్కవాళ్ళతో పోల్చుకోకూడదు. దీనివల్ల అనవసరంగా ఒత్తిడికీ, నిరాశలోకీ వెళ్ళే ప్రమాదముంటుంది. ఆశావహ దృక్పథం పెంచుకోవాలి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ టెస్ట్‌ సిరీస్‌ రాయాలి. ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. దీనిలో అన్ని సబ్జెక్టుల మౌలికాంశాలు తెలుసుకోవాలి. ఇచ్చిన సమయం సరిపోతుంది. మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌ పద్ధతి. ప్రశ్న దగ్గరే కేటాయించిన స్థలంలో జవాబులు రాయాలి. అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌గా ప్రశ్నలుంటాయి. సమస్యలను పరిష్కరించాల్సివుంటుంది. 12 సబ్జెక్టుల్లో 8 సబ్జెక్టులను సమగ్రంగా, సంపూర్ణంగా చదివితే ఆ పరీక్షలో నెగ్గవచ్చు. రెండు పేపర్లలో ఒక్కోదానిలో ఏడు ప్రశ్నల్లో ఐదింటికి జవాబులు రాయాలి. కానీ ఐదూ రాయటానికి సమయం సరిపోదు. సమగ్రంగా నాలుగు మాత్రం రాయగలుగుతాము. మౌఖిక పరీక్షలో... హెచ్‌ఆర్‌ ప్రశ్నలు ఉండవు. సాంకేతికతను సమాజంలో ఆచరణాత్మకంగా ఉపయోగించటంపై ప్రశ్నలు అడుగుతారు.పుస్తకాలకు మాత్రమే పరిమితమా? బయట ఏం జరుగుతోందీ అవగాహన ఉందా లేదా అనేది పరీక్షిస్తారు. మన స్వభావాన్నీ పరిశీలిస్తారు.

ఇవి ముఖ్యం
* సమాధానాలు కచ్చితంగా రాయాలి.
* సమయ నిర్వహణ అవసరం.
* ఏకధాటిగా రోజూ ఒకే సబ్జెక్టు చదవకూడదు. రెండు గంటలకో సబ్జెక్టును మారుస్తూ చదివితే ఆసక్తి వస్తుంది.
* పూర్వ ప్రశ్నపత్రాలు పదేళ్ళవి సాధన చేయాలి.
* టెస్ట్‌ సిరీస్‌ రాసి తప్పులు సవరించుకోవాలి. ఫార్ములాల పునశ్చరణ కూడా జరుగుతుంది.
* వివిధ పీఎస్‌యూల ప్రశ్నపత్రాలు అభ్యాసం చేయాలి. దాంతో కాన్సెప్టుల రివిజన్‌ జరుగుతుంది.

 

ఏమిటి తేడా?
గేట్‌ .. అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌. అందుకే క్లిష్టం. కానీ ఈఎస్‌ఈలో మౌలిక అంశాలే ఉంటాయి కాబట్టి సులువు. అయితే సిలబస్‌ విషయానికొస్తే... మొదటిదానిలో తక్కువ (10 సబ్జెక్టులు), రెండోదానిలో ఎక్కువ (22 సబ్జెక్టులు). రెండిట్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నప్పటికీ తికమక పెట్టే ఆప్షన్లు గేట్‌లోనే ఎక్కువ.. ఈఎస్‌ఈలో అవి అంతగా ఉండవు. గేట్‌ స్కోరు ద్వారా ఉద్యోగాలు ఎక్కువ లభిస్తాయి. ఈఎస్‌ఈ ద్వారా అవి పరిమితం. రైల్వేస్‌, డిఫెన్స్‌, నేవల్‌, రేడియో రెగ్యులారిటీ సర్వీసెస్‌.. ఇలాంటివి. గేట్‌ను ఆరు నెలలు కష్టపడి రాసేయవచ్చు. కానీ ఈఎస్‌ఈ నెగ్గటం సుదీర్ఘ ప్రక్రియ. రెండు మూడేళ్లు పడుతుంది. తెలుగు విద్యార్థులు ఏడాది గట్టిగా ప్రయత్నించి రాకపోతే నిరాశపడి వదిలేస్తారు. కానీ రెండు సంవత్సరాల కృషి తప్పనిసరి. ఉత్తర భారతదేశ విద్యార్థులు ఒక్కొక్కళ్ళు 3-4 ఏళ్ళు ఈఎస్‌ఈకి కేటాయిస్తారు కాబట్టి వారి విజయశాతం ఎక్కువ. ఐఐటియన్లు మాత్రమే ఈఎస్‌ఈ సాధిస్తారని చాలామంది అనుకుంటుంటారు. ఇది పొరపాటు అభిప్రాయం. ఇంటర్‌ వరకూ ఇంగ్లిష్‌ మీడియం చదవని నేనే ఈఎస్‌ఈ ర్యాంకు కొట్టాను. ఇక ఏ విద్యార్థి అయినా నిశ్చయంగా సాధించవచ్చు!

 

బ్లూటూత్‌... వైఫై... టూజీ.. ఫోర్‌ జీ!
యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్ష మౌఖిక పరీక్ష ఎలా ఉంటుంది? ఆగస్టు 10న దిల్లీలో ఈఎస్‌ఈ మౌఖిక పరీక్షకు హాజరైన శ్రీనివాసులు తన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలను ఇలా పొందుపరిచాడు. దీనిలో సాంకేతికపరమైన ప్రశ్నలే ప్రధానంగా ఉండటం గమనించవచ్చు.
Me: Good afternoon sir.
Chairman: Good afternoon. Take your seat.
Me: Thank you sir.
Chairman: Have you studied B.Tech from a private college?
Me: Yes, sir.
Chairman: Worked in DLRL for 3 years?
MeYes, sir.
ChairmanIs this a private company?
Me: No, sir. It is one of the DRDO labs.
Chairman: What is your role?
Me: (I explained).
Chairman: Have you found any new method in testing part?
Me: (I explained)
Chairman: What are the pentavalent and trivalent impurities?
Me: Pentavalent impurities are Phosphorous, Arsenic and Antimony. Trivalent impurities are Gallium, Alluminium and Boron.
Member 1: Do you Know ECM and ECCM techniques used in your lab?
Me: (I explained)
Member 1: What is LCD and LED? What are the differences? How could you differentiate LED TV and LCD TV by seeing it?
Me: In LCD, primary light source is required. LCD takes less power and durability is less where as LED takes more power and durability is more.
Member 2: What is rectifier? What are the different types?
Me: Rectifier is an electronic circuit which converts AC to pulsating DC. There are 3 different types of rectifiers. Those are- 1) Half wave rectifier 2) Full wave rectifier 3) Bridge rectifier.
Member 2: What is the next stage of rectifier?
Me: Filter.
Member 2: How filter will remove ripples from output of rectifier?
Me: Filter should be designed such that it will bypass the ac components and allow dc components.
Member 2: What is the discharging time for e-filter?
Me: I don't know sir.
Member 3: What are the wireless digital technologies?
Me: Sorry sir, I am unable to recollect.
Member 3: What is the Bluetooth? What is its range? What is the frequency used and speed?
Me: Bluetooth is Personal Area Network used to transfer data for short distance within 10 mts. The frequency used for bluetooth is 2.4GHz and speed is upto 1MHz.
Member 3: What is WiFi? What is its range? What are the frequencies used and its speed?
Me: WiFi means wireless fidelity. WiFi range is upto 100 mts. The frequencies used for WiFi are 2.4GHz and 5GHz. We can get the speed upto 54 Mbps.
Member 3: What is 2G?
Me: 2G is the second Generation mobile digital technology used for voice and data.
Member 3: What is the GSM? What multiple access technique used in that?
Me: GSM is Global System for Mobile communication. In GSM we use TDMA and FDMA multiple access technique.
Member 3: Why do we have to move from 2G to 2.5G and then 2.75G?
Me: To increase the data speed, we have to move from 2G to 2.75G.
Member 3: What is the GPRS?
Me: GPRS is the General Packet Radio Service. It is used to access the data in the form of packets.
'OK. you can leave now'
'Thank you sir'

Posted Date: 01-11-2019


  • Tags :