Post your question

 

    Asked By: prasanth

    Ans:

    బీఎల్‌ చేసినవారు కనీసం మూడు సంవత్సరాల లా ప్రాక్టీస్‌తో సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) నియామక పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల లా ప్రాక్టీస్‌ అనుభవం లేకపోతే రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ వచ్చేనాటికి బీఎల్‌ అయి కనీసం మూడేళ్లు పూర్తి అవ్వడంతో పాటు, బీఎల్‌లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 55%) మార్కులు పొందాలి. న్యాయవాదిగా నమోదై, మూడేళ్ల అనుభవం లేనివారు కూడా ఫ్రెష్‌ లా గ్రాడ్యుయేట్స్‌ కేటగిరీ కింద అర్హులే. న్యాయవాదిగా అనుభవం ఉన్నవారందరూ బార్‌ అసోసియేషన్‌ నుంచి పొందిన ప్రాక్టీస్‌ సర్టిఫికెట్‌ను రుజువుగా సమర్పించాలి.
    సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి 23- 35 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 సంవత్సరాలు) వయసు, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం లేనివారికి 23- 26 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 31 సంవత్సరాలు) వయసు ఉండాలి. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) రాత పరీక్షకు అర్హత సాధించాలంటే రెండు గంటల వ్యవధిలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించినవారినుంచి ప్రకటించిన ఖాళీల సంఖ్యకు 10 రెట్ల సంఖ్యలో అభ్యర్థుÄలను రాత పరీక్షకు అనుమతిస్తారు. స్క్రీనింగ్‌ పరీక్ష లో పొందిన మార్కులకు చివరి ఎంపికలో వెయిటేజి ఉండదు. రాత పరీక్ష మూడు పేపర్లు
    (సివిల్‌ లాస్, క్రిమినల్‌ లాస్, ఇంగ్లిష్‌)గా, ఒక్కో పేపర్‌ను మూడు గంటల వ్యవధిలో, 100 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ పరీక్షను క్వాలిఫైయింగ్‌ పరీక్ష గానే గుర్తించి, మొదటి రెండు పేపర్లలో 200 మార్కులకు అభ్యర్ధులు పొందిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, ఇంటర్వ్యూ (వైవా వోస్‌)కి షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. సివిల్‌ లాస్, క్రిమినల్‌ లాస్‌.. రెండు పేపర్లలో కనీసం 60% మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50%) పొందినవారి నుంచి 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. మొత్తం 230 మార్కుల్లో అభ్యర్ధులు పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: prasanth

    Ans:

    మీ అబ్బాయి తన కెరియర్‌ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్‌ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్‌ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి.
    ఐసెట్‌లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్‌నెట్‌లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్‌లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి.
    విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్‌ తోపాటు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: రవిశంకర్‌

    Ans:

    - మీ స్నేహితుడికి బీబీఏతో పాటు పది సంవత్సరాల ఉద్యోగానుభవం ఉంది కాబట్టి ఈఎంబీఏ (ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ) చదవడమే మంచిది. డిస్టెన్స్‌ ఎంబీఏలో చాలామంది విద్యార్థులు ఉద్యోగానుభవం లేకుండా నేరుగా అడ్మిషన్‌ తీసుకొంటారు. చాలా డిస్టెన్స్‌ ఎంబీఏ ప్రోగ్రాంలలో కాంటాక్ట్‌ క్లాసులకు హాజరు అవ్వాల్సిన అవసరం కూడా లేనందున నైపుణ్యాలను నేర్చుకొనే అవకాశం ఉండదు. ఈఎంబీఏ క్లాస్‌ రూంలో అందరూ ఉద్యోగానుభవం ఉన్నవారే ఉండటం వల్ల ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకొనే అవకాశాలు ఎక్కువ. ఈఎంబీఏ ప్రోగ్రాంలో ప్రతి సెమిస్టర్‌లో కొన్ని కాంటాక్ట్‌ క్లాసులు తప్పనిసరి. ప్రొఫెసర్స్‌ నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈఎంబీఏ బోధనావిధానం కూడా డిస్టెన్స్‌ ఎంబీఏ కంటే భిన్నం. ఈఎంబీఏలో ఎక్కువగా కేస్‌ డిస్కషన్, సెమినార్లు, గేమ్స్, యాక్టివిటీస్‌ల సహాయంతో బోధన ఉంటుంది. థియరీ కంటే మెనేజీరియల్‌/ ప్రాక్టికల్‌ అప్లికేషన్స్‌కు ప్రాముఖ్యం అధికం. ఈఎంబీఏను ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ నుంచి చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.  - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: ఎస్‌.పద్మ

    Ans:

    మీ అబ్బాయి తన కెరియర్‌ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్‌ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్‌ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి. ఐసెట్‌లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్‌నెట్‌లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్‌లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి.  విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్‌ తోపాటు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం  తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎస్‌.పద్మ

    Ans:

    మీ అబ్బాయి తన కెరియర్‌ గురించి ఈ పాటికే ఒక నిర్ణయం తీసుకొనివుంటాడు. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక కూడా తల్లిదండ్రులు, బంధువులు కెరియర్‌ను నిర్ణయించడం శ్రేయస్కరం కాదు. ఎంటెక్‌ చేయాలా, ఎంబీఏ చేయాలా, ఎంబీఏ చేస్తే ఇండియా లోనా, విదేశాల్లోనా అనేవి అతనికే వదిలివేయడం మంచిది. తల్లిదండ్రులుగా అన్ని అవకాశాల్లో ఉన్న సాధకబాధకాలు చర్చించి నిర్ణయం మాత్రం తననే తీసుకోనివ్వండి.

    ఐసెట్‌లో మంచి ర్యాంకు వస్తే రాష్ట్రంలో ఉన్న మంచి ఎంబీఏ కాలేజీల్లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. టిస్‌నెట్‌లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌లో మాత్రమే చదివే అవకాశం ఉంటుంది. క్యాట్‌లో మంచి స్కోరు పొందితే ఐఐఎంల్లో, దేశంలో ఉన్న కొన్ని ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. కొన్ని ప్రైవేటు బిజినెస్‌ స్కూల్స్‌ ప్రత్యేక ప్రవేశపరీక్షలు తామే నిర్వహించి ఎంబీఏ కోర్సులో అడ్మిషన్లు చేపడుతున్నాయి.  విదేశాల్లో ఎంబీఏ విషయానికొస్తే జీమ్యాట్‌ తోపాటు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌లో మంచి స్కోరు పొంది, ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశానికి ప్రయత్నాలు చేయవచ్చు. సాధారణంగా విదేశాల్లో ఎంబీఏ చేయడానికి కనీసం రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండటం మంచిది. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ చదవాలంటే కనీసం కోటి రూపాయలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం  తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎం.రత్నకిశోర్‌

    Ans:

    సివిల్స్‌ లాంటి పరీక్షల్లో పోటీ ఎక్కువ ఉంటుంది. అందుకే చాలామంది తల్లిదండ్రులు మీ నాన్నగారిలాగే ఆలోచిస్తూ సివిల్స్‌ సన్నద్ధతతో పాటు, మరేదైనా ప్రొఫెషనల్‌ కోర్సు చదివితే, భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా స్థిరపడాలంటే బీఎల్‌ కోర్సు కూడా బాగా చదవాలి. ప్రస్తుతం మీముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
    1) సివిల్స్‌కి మాత్రమే సన్నద్ధం అవ్వడం. ఒకవేళ దీనిలో నెగ్గకపోతే డిగ్రీ విద్యార్హతతో పోటీ పరీక్షలు రాసి మరేదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందడం. మీకు ఆసక్తి ఉంటే అప్పుడు కూడా బీఎల్‌ చదవొచ్చు.
    2) బీఎల్‌ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వడం. ఒకవేళ సివిల్స్‌లో విజయం సాధించలేకపోతే న్యాయవాదిగా స్థిరపడవచ్చు.
    3) సివిల్స్‌ సన్నద్ధత + బీఎల్‌ చదవడం. అయితే రెండింటినీ సమన్వయం చేస్తూ ఒత్తిడికి గురవ్వకుండా, ప్రణాళికాబద్ధంగా చదవకపోతే ఈ రెండింటిలో మీరు దేనికీ న్యాయం చేయలేకపోవచ్చు

    . - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: మాలతి

    Ans:

    మీ అమ్మాయి ఈ పాటికే తన భవిష్యత్తు గురించి ఓ నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు. మీ గ్రామంలో ప్రాక్టీస్‌ పెట్టించాలనేది మీ నిర్ణయమా? తనదా? నిర్ణయం ఎవరిదయినా, అందులో ఉండే లాభనష్టాలను చర్చించండి. మీ గ్రామంలో ప్రాక్టీస్‌ చేయడం వల్ల  మీ గ్రామస్థులకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. కానీ, మీరు హాస్పిటల్‌పై పెట్టిన పెట్టుబడి వెనక్కు రావడానికి చాలా సమయం పట్టవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా శస్త్రచికిత్సలకోసం దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్తున్నారు. ఎంబీబీఎస్‌ చదివిన చాలామంది సాధారణ జబ్బులు, ప్రాథమిక చికిత్సలకే పరిమితమవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వైద్యశాలలకు పట్టణాలనుంచి స్పెషలిస్ట్‌ సర్జన్లు వచ్చి శస్త్రచికిత్సలు చేస్తున్నారు. గ్రామీణ సమాజంలో కూడా ఆరోగ్యం, వైద్యంపై అవగాహన పెరగడం వల్ల రోగులు/ బంధువులు చికిత్సకు వెళ్లేముందు డాక్టర్ల విద్యార్హతల గురించి కూడా వాకబు చేస్తున్నారు. ఒకవేళ మీ అమ్మాయి ఎంబీబీఎస్‌తోనే ప్రాక్టీస్‌ మొదలుపెడితే పని ఒత్తిడితో ఎప్పటికీ పీజీ చేయలేకపోవచ్చు. ప్రాక్టీస్‌తో నిమిత్తం లేకుండా, ఉన్నత విద్యార్హతలుండటం ఎప్పుడూ శ్రేయస్కరమే! పీజీతోనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే గ్యారంటీ కూడా లేదు. మెడిసిన్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సుల్లో సర్టిఫికెట్‌లతో పాటు నైపుణ్యాలు కూడా చాలా అవసరం. మీ అమ్మాయి దీర్ఘకాలిక, స్వల్ప కాలిక ఆశయాలను దృష్టిలోపెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: కరుణ

    Ans:

    - మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ శిక్షణ పూర్తిచేసినవారికి ప్రభుత్వ వైద్య, ఆరోగ్యశాఖలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో, వైద్య, ఆరోగ్యరంగాల్లో పనిచేసే స్వచ్ఛంద సేవాసంస్థల్లో, కమ్యూనిటీ హెల్త్‌ ఆర్గనైజేషన్లలో, వృద్ధాశ్రమాల్లో కొలువుల్లో చేరొచ్చు. మీరు ఒకవేళ డిగ్రీ పూర్తి చేస్తే మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌హెల్త్, ఎంబీఏ- హెల్త్‌కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్స్‌ ఇన్‌ ఆప్టోమెట్రీ లాంటి కోర్సులు చేసే అవకాశం ఉంది. ఆసక్తి ఉంటే మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, కార్డియాలజీ, రేడియాలజీ, హెల్త్‌ సైకాలజీ, ఆడియాలజీ, స్పోర్ట్స్‌ మెడిసిన్‌ లాంటి వాటిలో సర్టిఫికెట్‌/ డిప్లొమాలు చేయండి. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌  కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: లహరి

    Ans:

    - మీకు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో ఆసక్తి ఉంటే ఫ్యాషన్‌కి సంబంధించిన సబ్జెక్టుల్లోనే డిగ్రీ చేసే ప్రయత్నం చేయండి. ఫీజు కట్టడం ఇబ్బందయితే బ్యాంకులో విద్యారుణం తీసుకొనే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఫీజు తక్కువ. అందుకని ప్రవేశ పరీక్షల్లో మెరుగైన మార్కులు పొంది ప్రభుత్వ కళాశాలల్లో సీటు తెచ్చుకొని, మెరిట్‌ స్కాలర్‌షిప్‌కోసం ప్రయత్నం చేయండి. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో స్థిరపడాలనుకొంటే ఫ్యాషన్‌ డిజైన్, లెదర్‌ డిజైన్, యాక్సెసరీ డిజైన్, టెక్స్‌టైల్‌ డిజైన్, నిట్‌ వేర్‌ డిజైన్, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్, అపారెల్‌ ప్రొడక్షన్‌ లాంటి స్పెషలైజేషన్లతో బీ డిజైన్‌/బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ లాంటి కోర్సులు చేయవచ్చు. వీటితో పాటు బీఎస్సీలో ఫ్యాషన్‌ డిజైన్, ఫ్యాషన్‌ మర్చెండైౖౖజింగ్‌ లాంటి కోర్సులూ చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే.. ఫ్యాషన్‌ స్ట్టైలింగ్, ప్యాటర్న్‌ మేకింగ్, టెక్స్‌టైల్స్‌ ఫర్‌ ఇంటీరియర్స్‌ అండ్‌ ఫ్యాషన్, గార్మెంట్‌ కన్‌స్ట్రక్షన్, టైలరింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ లాంటివాటిలో తక్కువ ఖర్చుతో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు కూడా చేసే అవకాశం ఉంది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో రాణించాలంటే సర్టిఫికెట్‌ మాత్రమే ఉంటే సరిపోదు. సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, కమ్యూనికేషన్‌ స్కిల్స్, నలుగురితో కలిసి పనిచేయగల సామర్థ్యం కూడా చాలా అవసరం.

    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: కరుణాకర్‌

    Ans:

    జూ క్యురేటర్‌గా పనిచేయాలంటే, జంతుశాస్త్రం లాంటి సబ్జెక్టులో కనీసం డిగ్రీ చదివి ఉండాలి. వీటితో పాటు జంతు ప్రవర్తన, వన్యప్రాణి నిర్వహణలపై అవగాహన ఉండాలి. జంతువులతో పనిచేసిన అనుభవం కూడా అవసరం. చాలా జంతు ప్రదర్శనశాలలు జువాలజీలో మాస్టర్స్‌ డిగ్రీ చదివినవారిని క్యురేటర్లుగా నియమించుకొంటున్నాయి. జంతు ప్రవర్తన, ఎవల్యూషనరీ బయాలజీ, జెనెటిక్స్, ఫిజియాలజీ, ఎకాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ సబ్జెక్టులపై కనీస అవగాహన అవసరం. వెటర్నరీ సైన్స్, యానిమల్‌ ఫీడ్‌ ప్రొడక్షన్, యానిమల్‌ బ్రీడింగ్, యానిమల్‌ వైరసెస్‌లో సర్టిఫికెట్‌/ డిప్లొమా చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. జూ క్యురేటర్‌గా రాణించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్, శారీరక దార్ఢ్యం, పరిశీలనా శక్తి.. మొదలైన నైపుణ్యాలు అవసరం. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌