Post your question

 

    Asked By: Babu

    Ans:

    జ: ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ ఎక్కడ చదివితే ఆ ప్రాంతం లోకల్‌ అవుతుంది. దాని ప్రకారం మీరు రంగారెడ్డి జిల్లా కిందకు వస్తారు.

    Asked By: కె. రామకృష్ణ

    Ans:

    దూరవిద్యలో ఎంబీఏ చేయాలంటే డిగ్రీ విద్యార్హత సరిపోతుంది. మీరు బీఎస్‌సీ చదివారు కాబట్టి నిరభ్యంతరంగా ఎంబీఏ చేయవచ్చు. 15 సంవత్సరాల వృత్తి అనుభవంతోపాటు ఎంబీఏ కూడా చేసినట్లయితే మీకు ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థలోనే పదోన్నతి అవకాశం ఉండవచ్చు. మరేదైనా సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగమూ పొందవచ్చు. నిర్మాణ రంగంలో ఉన్నారు కాబట్టి ఎంబీఏ: కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌/ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌/ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌/ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ వీటిలో ఏదో ఒకటి చేసినట్లయితే మీరు మెరుగైన ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: అఖిల్‌

    Ans:

    మీరు తెలంగాణ పరిధిలోకి వస్తారు. కొత్త నిబంధనల ప్రకారం ఒకటి నుంచి ఏడు తరగతుల్లోపు నాలుగు సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే లోకల్‌ అవుతారు. ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన ఏదైనా ప్రైవేటు పాఠశాలలో చదివి ఉండాలి. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేటు స్కూల్‌లో చదివి ఉంటే  స్థానికతను ధ్రువపరుస్తూ ఎంఆర్‌ఓ సంతకం చేసి ఇచ్చిన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. 

    Asked By: రవికాంత్‌

    Ans:

    గ్రూప్‌-1ను డిస్క్రిప్టివ్‌ ప్రధానంగాను, గ్రూప్‌-2ను ఆబ్జెక్టివ్‌ తరహాలోనూ నిర్వహిస్తారు. గ్రూప్‌-1కి సబ్జెక్టులను విశ్లేషణాత్మక అవగాహనను పెంపొందించుకునే విధంగా చదవాలి. ఈ పరీక్షకు రాత నైపుణ్యం, రాసే భాషపై పట్టు కూడా అవసరం. గ్రూప్‌-2లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు కాబట్టి సబ్జెక్టు మౌలికాంశాలను క్షుణ్ణంగా చదివి బిట్లు ప్రాక్టీస్‌ చేస్తే సరిపోతుంది. 

    Asked By: ఎ. అరవింద్‌

    Ans:

    ఏ సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసినవారికైనా పూర్వ విద్యార్హతలతో సంబంధం లేకుండా సమస్యా పరిష్కార సామర్థ్యం, కోడింగ్, ప్రోగ్రామింగ్, అనలిటికల్‌ నైపుణ్యాలు ఉంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ. మీరు డిగ్రీ చేయడానికి తీసుకున్న ఎక్కువ సమయం పెద్ద సమస్య కాదు. డిగ్రీ పూర్తి చేశాక ఏ రంగంలో స్వయం ఉపాధి పొందుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో వచ్చిన మార్కులను కాకుండా మీకున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొనే కంపెనీలు చాలా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ  చేయడం అనేది మీకో అదనపు అర్హత అవుతుంది. ముందుగా మీరు డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ కోర్సులను మరొకసారి పూర్తిగా చదివి విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకోండి. కొన్ని లైవ్‌ ప్రాజెక్టుల్లో పనిచేసి మీ బయోడేటాను మెరుగుపర్చుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే సీ‡, సీ‡ ప్లస్‌ ప్లస్, జావా, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, వెబ్‌ డెవలప్‌మెంట్, బిగ్‌ డేటా, మెషిన్‌ లర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి వాటిలో మీకు నచ్చిన కోర్సుల్ని చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: Lingala

    Ans:

    సిలబస్‌ ప్రకారం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు (ఇంగ్లిష్‌/ తెలుగు మీడియం) చదవండి.

    Asked By: జార్జి ముల్లార్‌

    Ans:

    ఇంటర్‌ చదివిన తరువాత మీకున్న చాలా అవకాశాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్‌ అనేవి రెండు ముఖ్యమైన మార్గాలు. ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం మీ భావి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇలాంటి కెరియర్‌ నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ జీవితాశయం ఏమిటి? మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది? గతంలో మీరు రాసిన వార్షిక పరీక్షల్లో ఎన్ని మార్కులు పొందారు? మీ బలాలూ బలహీనతలూ ఏమిటి? మీ ముందున్న అవకాశాలూ, సవాళ్లు ఏమిటి? చదువుకు అయ్యే ఖర్చుకు ఎంత కాలం మీ కుటుంబ సహకారం ఉంటుంది?- ఇలాంటి విషయాలపై అవగాహన పొందాక ఏ కోర్సు చదవాలో నిర్ణయించుకోండి.
    ప్రతి కోర్సుకూ చాలా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ చదివినవారికి ఉద్యోగం రాకపోవచ్చు; సాధారణ డిగ్రీ చదివినవారు ఐఏఎస్‌ కూడా అవ్వొచ్చు. ఏ కోర్సు చదివినా దాన్ని ఇష్టంతో, ప్రణాళికాబద్ధంగా చదివి, ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కావలసిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను అలవర్చుకోవాలి. అప్పుడే అద్భుతమైన భవిష్యత్తు సొంతమవుతుంది. మీకు పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలతో పాటు విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసి, దేశం గర్వించే శాస్త్రవేత్త అవ్వొచ్చు. అలాకాకుండా డిగ్రీ తరువాత కానీ, పీజీ తరువాత కానీ పోటీ పరీక్షలు రాసి మంచి ఉద్యోగం పొందవచ్చు. ఇంజినీరింగ్‌ విషయానికొస్తే ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభను కనపర్చి, ప్రముఖ విద్యాసంస్థలో ఈ కోర్సుని బాగా చదివితే మంచి వేతనంతో ఉద్యోగం సాధించవచ్చు. ఇంజినీరింగ్‌ రంగంలో పరిశోధనపై ఆసక్తి ఉంటే ఎంటెక్, పీహెచ్‌డీ చేసి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందినవారు కూడా అర్హులే. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: jagadeeswara rao

    Ans:

    You need to write LAWCET to get admission into any Law course. As per your target Constitution related subjects specialization in Law course will be good.