Post your question

 

    Asked By: బి. సతీశ్‌కుమార్‌

    Ans:

    ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు టెక్నికల్‌ సబ్జెక్టులపై పట్టు ఉన్నప్పటికీ, జనరల్‌ స్టడీస్‌ విషయానికొస్తే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే, యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌లో ప్రశ్నల స్థాయి కొంత కఠినంగా ఉంటుంది. కానీ, కనీసం రెండు సంవత్సరాలపాటు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమయితే ఉత్తీర్ణత కష్టమేమీ కాదు. చాలామంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ చదివే సమయంలో ఈఎస్‌ఈలోని చాలా టాపిక్స్‌పై పెద్దగా దృష్టి పెట్టరు. ప్రిలిమినరీలో సమయ నిర్వహణ చాలా ముఖ్యం. సిలబస్‌నూ, పాత ప్రశ్నపత్రాలనూ పరిశీలించి, మీ ప్రస్తుత విషయ పరిజ్ఞానాన్ని అంచనా వేసుకొని సన్నద్ధత మొదలుపెట్టండి. ఇక మెయిన్స్‌ ఇంజినీరింగ్‌లో రాసిన పరీక్షలకు పూర్తి విభిన్నం. ముఖ్యంగా ప్రశ్నలు కాంప్రహెన్షన్, అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్, ఎవాల్యుయేషన్‌లను పరీక్షించేవిధంగా ఉంటాయి. మీరు ఉద్యోగం చేస్తూనే ఈ పరీక్ష రాయాలనుకొంటున్నారు కాబట్టి, ఉద్యోగాన్నీ, ప్రిపరేషన్‌ సమయాన్నీ సమన్వయం చేసుకొనేలా ప్రణాళికను తయారు చేసుకోండి. వీలుంటే ఒక సంవత్సరం ఉద్యోగానికి సెలవు పెట్టండి. ప్రామాణిక పుస్తకాలనుంచి నోట్స్‌ రాసుకొని, కనీసం రోజుకు 10 గంటలు చదివితే ఐఈఎస్‌ సాధించాలనే మీ కలను సాకారం చేసుకోవచ్చు! - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: యశ్వంత్

    Ans:

    గ్రూప్‌-4లో చాలా వరకు ఉద్యోగాలు ఇంటర్‌ అర్హతతోనే ఉంటాయి. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఏటా విడుదల చేసే కొన్ని నోటిఫికేషన్లకు ఇంటర్‌ సరిపోతుంది. ఇంటర్మీడియట్‌ తర్వాత పలు రకాల ఉద్యోగ అవకాశాల వివరాల కోసంఈ లింక్‌ను క్లిక్‌ చేసి చూడండి

    https://pratibha.eenadu.net/notifications/latestnotifications/government-jobs/2-8-27

    Asked By: ఎ. రమేష్

    Ans:

    ఇంతకుముందు పే ప్రొటెక్షన్‌ను కల్పించేవారు. అయితే ప్రస్తుతం పే ప్రొటెక్షన్‌ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది.

    Asked By: అనిల్ కుమార్

    Ans:

    గ్రూప్‌-1 దరఖాస్తులో పొరబాటున వ్ని అని పడినా చేసేది ఏమీ ఉండదు. గడువు తేదీ ముగియడంతో ఎడిట్‌ చేసుకునే అవకాశం ఆగిపోయింది. భవిష్యత్తులో సర్వీస్‌ కమిషన్‌ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇస్తే చేసుకోవచ్చు.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    మీకు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌ఓ) పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది.

    Asked By: కంభంపాటి వెంకటేష్ శారదా దేవీ

    Ans:

    40 శాతం లేదా అంతకు మించి వైకల్యం ఉంటే గ్రూప్‌-1 హెచ్‌హెచ్‌ కేటగిరీ పోస్టులకు అర్హత ఉంటుంది.

    Asked By: ఒక అభ్యర్థి

    Ans:

    స్టేట్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్నవారికి ఒకవేళ వేరే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వస్తే పే ప్రొటెక్షన్, సర్వీస్‌ ప్రొటెక్షన్‌ అనేది సంబంధిత డిపార్ట్‌మెంట్‌ని బట్టి ఉంటుంది.

    Asked By: వేణువంక రాజశేఖర్

    Ans:

    ఎటువంటి సమస్యా ఉండదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల దరఖాస్తుకు గడువు తేదీ ముగిసింది కాబట్టి ఎడిట్‌ చేసుకునే అవకాశం లేదు.