Post your question

    Asked By: sahithi

    Ans:

    గ్రూప్‌ - 1 ప్రిపరేషన్‌కు యూపీఎస్సీ రిఫరెన్స్‌ పుస్తకాలను చదువుకోవచ్చు. అయితే వీటితోపాటు తెలంగాణ ఉద్యమం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాలను చదవాలి. అలాగే రోజూ దినపత్రికను చదివి నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుంటే పరీక్షకు ఉపయోగకరం.

    Asked By: Saketh

    Ans:

    గ్రూప్‌ -1 ప్రిలిమినరీ పరీక్షకు మూడు నుంచి నాలుగు నెలల సమయం   ఉండవచ్చు. వీలైనంత ఎక్కువ సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించండి.

    Asked By: Shiva

    Ans:

    ప్రైవేట్‌ అని నింపితే సరిపోతుంది. మిగిలిన తరగతులన్నింటికీ సంబంధించిన బోనఫైడ్‌లు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

    Asked By: Rahul

    Ans:

    ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను తహశీల్దారు వద్ద పొందాలి. ప్రస్తుత జీవో  ప్రకారం కుటుంబ ఆదాయం సాలీన రూ.8 లక్షలకు మించకూడదు, భూమి రెండు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు లాంటి అనేక పరిమితులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మీ ప్రాంతానికి చెందిన తహశీల్దారు కార్యాలయాన్ని సంప్రదించండి.

    Asked By: ఆర్‌. దుర్గాప్రసాద్‌

    Ans:

    కొంత ఆలస్యం అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి, ఆ విద్యార్హతలతో మెరుగైన ఉద్యోగాలు సంపాదించడం శ్రేయస్కరం. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక, ఇంటర్మీడియట్‌ ఎంపీసీతో చదివి మంచి కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివితే త్వరగా ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇంటర్‌లో బైపీసీ తీసుకొని, నాలుగు సంవత్సరాల బీఎస్సీ నర్సింగ్‌ చదివితే వైద్యశాలల్లో నర్సుగా స్థిరపడొచ్చు. ఇంటర్మీడియట్‌ తరువాత రెండు సంవత్సరాల డీ…ఈడీ చేసి బోధన రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. పదో తరగతి పూర్తి చేసిన తరువాత ఐ.టి.ఐ., పాలిటెక్నిక్‌ లాంటి కోర్సులున్నాయి. ఐ.టి.ఐ. పూర్తి చెయ్యడానికి రెండు సంవత్సరాలు, పాలిటెక్నిక్‌ పూర్తి చెయ్యడానికి మూడు సంవత్సరాలు పడుతుంది. త్వరగా ఉద్యోగం పొందాలనుకొంటే, పాలిటెక్నిక్‌ లేదా ఐ.టి.ఐ. ఎంచుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకొంటే ఇంటర్‌ లో మీరు తీసుకునే గ్రూపును బట్టి ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఒక విద్యార్థి

    Ans:

    ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏడో తరగతి వరకు నాలుగేళ్లు వరుసగా ఏ ప్రాంతంలో చదివితే ఆ జిల్లా స్థానికత పొందుతారు. మీరు నాలుగో తరగతి నుంచి ఏడో తరగతి వరకు  కరీంనగర్‌లో చదివారు కాబట్టి అదే జిల్లా స్థానికత కిందకు వస్తారు. 

    Asked By: nagaraju

    Ans:

    రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ ఎందుకు కావాలో పూర్తి వివరాలను చెప్పాల్సి ఉంటుంది. ఓపెన్‌ స్కూల్‌కి సంబంధించి నాలుగేళ్లకు ధ్రువీకరణ పత్రం కావాలని అడిగితే కచ్చితంగా ఇస్తారు.  గ్యాప్‌ సర్టిఫికెట్‌ తీసుకుంటే మీరు నాన్‌-లోకల్‌ కిందకు వస్తారు. కాబట్టి మీరు రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ తీసుకోండి.