• facebook
  • whatsapp
  • telegram

Only two things are compared

Snigda: Manorama seems to be quite clever, doesn't she?

(మనోరమ చాలా తెలివైనదానిలా కనిపిస్తుంది, ఆమె తెలివైంది కదా?)

Manjula: No seeming Snigda, she is. In fact, she is the cleverest girl in the class.

(కనిపించడం కాదు. నిజంగా తను తెలివైందే. చెప్పాలంటే, తరగతిలో అందరి కంటే తనే తెలివైంది.)

Snigda: I thought Nidhi was the cleverest. How does she stand in comparison with the others in the class?

(నిధి చాలా తెలివైందని అనుకున్నా. మిగతావారితో పోలిస్తే తరగతిలో తనెలా ఉంటుంది?)

Manjula: Nidhi is clever too. She is however one of the cleverest, not the cleverest.

A few other girls in the class are as clever as she.

(నిధి కూడా తెలివైందే, కానీ తెలివైనవాళ్లలో తనూ ఒక అమ్మాయి. తనంత తెలివిగలవాళ్లు ఆ తరగతిలో కొంతమంది ఉన్నారు.)

Snigda: So your point is: Manorama is the cleverest girl in the class, and Nithya is one of the cleverest girls in the class, isn't it?

(ఆ తరగతిలో మనోరమ అందర్లో అత్యంత తెలివైందనీ; అలాగే తరగతిలోని అత్యంత తెలివైనవాళ్లల్లో నిత్య కూడా ఒక అమ్మాయి అనే కదా నువ్వనేది. అలా కదా?)

Manjula: Exactly.

(సరిగ్గా అదే.)

Snigda: You mean as well that Manorama is cleverer than Nithya too.

(నిత్య కంటే మనోరమ తెలివైందని కూడా కదా నువ్వనేది.)

Manjula: What about Pujitha?

(మరి పూజిత సంగతేంటి?)

Snigda: She is not one of the cleverest girls in the class.

(తరగతిలోని అత్యంత తెలివైనవారిలో పూజిత ఒక అమ్మాయి కాదు.)

Manjula: Any doubt?

(సందేహమా?)

Now, look at the following sentences...

1) Manorama is the cleverest girl in the class.

(తరగతిలో అందరి కంటే మనోరమ అత్యంత తెలివైంది.)

2) Nidhi is one of the cleverest girls in the class.

(తరగతిలోని అంత్యంత తెలివైన అమ్మాయిల్లో నిధి ఒక అమ్మాయి.)

3) Manorama is cleverer than Nidhi.

(నిధి కంటే మనోరమ ఎక్కువ తెలివైంది.)

4) Pujitha is not one of the cleverest girls in the class.

(తరగతిలోని అత్యంత తెలివైనవారిలో పూజిత ఒక అమ్మాయి కాదు.)

Explanations

Sentence No . 1 లోని superlative degree ని మిగతా రెండు degrees లోకి మార్చడం ఇంతకుముందు పాఠాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మిగతా Models చూద్దాం. వాటిలోని Superlatives ............

1) One of the Cleverest.

2) Not the cleverest.

మూడు, నాలుగు Models లలో ఇద్దరి/ రెండింటి మధ్య పోలిక (Comparison) ఉంటుంది.

Manorama is cleverer than Nidhi.

(నిధి కంటే మనోరమ తెలివైంది.)

1st Model మిగతా degrees లోకి ఎలా మార్చాలో కిందటి పాఠంలో నేర్చుకున్నాం. మళ్లీ ఓసారి చూద్దాం:

Superlative: Manorama is the cleverest girl/ of all girls in the class.

Comparative: Manorama is cleverer than any other girl/ all other girls in the class.

Positive: No other girl in the class is as/ so clever as Manorama.

Superlative: Nidhi is one of the cleverest girls in the class.

(తరగతిలో అత్యంత తెలివైన వారిలో నిధి ఒక అమ్మాయి.)

దీనికి

Comparative: Nidhi is cleverer than most other girls in the class.

(తరగతిలోని ఎక్కువ మంది అమ్మాయిల కంటే నిధి తెలివైంది.)

Positive: Very few girls in the class are as clever as Nidhi.

(నిధి అంత తెలివైన అమ్మాయిలు తరగతిలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు.)

గమనించండి:

Superlative: One of the most/ one of the best/ one of the + superlative.

ఈ Model కు Comparative:

Comparative: Comparative degree + than + most other + plural.

ఇదే Model కు

ఇప్పుడు మనం రెండో Model చూద్దాం:

Positive: Very few .... + as + positive degree + as .....

(Very few books are as interesting as the Mahabharatham.)

Model 3: Pujitha is not the cleverest girl in the class - Superlative.

(not + superlative degree)

Comparative: Some other .... comparative degree + than.

Positive: Some other ..... + at least as + positive + as.

Model 4 & 5: Here the comparison is only between two (ఇద్దరు/రెండింటి మధ్య). Superlative ఉండదు.

 అంతేకాకుండా రెండింటిని మాత్రమే పోల్చినప్పుడు...

1) Superlative Degree ఉండదు.

2) పోల్చినవాటి స్థానాలు మారతాయి. అంటే Comparative లోని first subject, positive లో చివర; Comparative లో చివర ఉండే subject, positive లో ముందుకు వస్తాయి.

3) Comparative లో not ఉంటే, Positive లో not రాదు. Comparative లో not లేకపోతే Positive లో not వస్తుంది.

e.g.: Manorama is cleverer than Nidhi - Comparative.

          (A)                (B)

Positive: Nidhi is not as clever as Manorama.

మీరు గమనించింది ఏమిటంటే....

1) Degree మారుస్తున్నప్పుడు నిధి, మనోరమల స్థానాలు తారుమారు అయ్యాయి.

2) Comparative లో not లేదు. Positive లో not ఉంది.

Model 5: Nidhi is not cleverer than Manorama.

(మనోరమ కంటే నిధి తెలివైంది కాదు) - Comparative.

Positive: Manorama is at least as Nidhi.

(మనోరమ కనీసం నిధి అంత తెలివైంది.)

Look at the following examples for better understanding.

MODEL - 1

Superlative: Uttar Pradesh is the largest state in India.

(Note 'the' before the superlative degree.)

Comparative: Uttar Pradesh is larger than any other state/ all other states in India.

Positive: No other state in India is so/ as large as Uttar Pradesh.

MODEL - 2

Superlative: Hyderabad is one of the largest cities in India.

(Note: One of the + plural)

Comparative: Hyderabad is larger than most other cities in India.

Positive: Very few cities in India are as large as Hyderabad.

MODEL - 3

  Superlative: Kavitha is not the tallest girl in the class.

   Comparative: Some other girls in the class are taller than Kavitha.

    Positive: Some other girls in the class are at least as tall as Kavitha. 

MODEL - 4

Comparative: The Mahabharatham is longer than the Ramayanam.

Only two things are compared - so no Superlative.

Also note, no 'not' in the comparative.

Positive: The Ramayanam is not as long as the Mahabharatham.

Note: 'Not' in the positive. The position of the subjects is interchanged.

MODEL - 5

Comparative: Himavanth is not stronger than Kanchan.

('Not' in the comparative)(Himavanth - first; Kanchan - last.)

No superlative as only two things are compared.

Positive: Kanchan is at least as strong as Himavanth.

(No 'not' in the positive- 'at least' in the positive.)

ఇవి బాగా practice చేద్దాం.

For a better understanding look at the following table:

Look at the following table to know the transformation of different models:

(నాలుగు మోడల్స్‌ను ఒక degree నుంచి మరో degreeకి ఎలా మార్చాలో చూడండి.)

Do the following exercise

Change the adjectives in the following/ Express the meanings of the following using the other degrees of comparison.

1) no other member of the team is taller than Ashok.

2) Kanchana is at least as good a singer as Nischala.

3) Kashmir is colder than any other state in India.

4) Mahabharatham is one of the greatest books in the world.

5) A foolish friend is more dangerous than a wise enemy.

6) The pen is mightier than the sword.

7) Sugandha is taller than most other girls in the town.

8) Apples are known better than mangoes across the world.

9) This is the best pair of shoes I have had so far.

10) Some boys in the class are at least as Karim.

                   ANSWERS

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌