• facebook
  • whatsapp
  • telegram

Definition of Pronoun

Kundan: Harish was here yesterday. He told me he had taken the exam. It was easy, he said. (హరీష్ నిన్న ఇక్కడ ఉన్నాడు. తను పరీక్ష రాశానని చెప్పాడు. అది సులభంగానే ఉందన్నాడు.)

Mahesh: My sister Kamala took the exam too. She said it was easy too. I am sure they will pass. (మా అక్క కమల కూడా రాసింది.ఆమె కూడా చెప్పింది సులభంగా ఉందని. వాళ్లు pass అవుతారని నాకు నమ్మకం ఉంది ).

Kundan: We, I mean you and I, have to wait for our exams for another week. Hope they will be easy. (మనం, అంటే నువ్వూ నేనూ మన పరీక్షలకు ఓ వారం ఆగాలి. అవి సులభంగా ఉంటాయని ఆశిద్దాం.)

Look at the conversation above. Note the use of the words, I, we, you, he, she, they. వీటిని pronouns అంటారు. Nouns కు బదులు వాడే మాటలు pronouns. (Nouns అంటే తెలుసు కదా? మనం దేనికైనా, ఎవరికైనా ఇచ్చే పేరు). 
పై సంభాషణలోని
Nouns, వాటికి బదులు వాడే Pronouns ఇలా ఉన్నాయి కదా:

Noun Noun కి బదులు వాడే Pronou
1. నా పేరు  I
2. మా/ మన పేర్లు We
3. నీ పేరు/ మీ పేర్లు You
4. Harish He
5. Kamala She
6. Exam It
7. వాళ్ల, వీళ్ల పేర్లు (e.g: Harish & Kamala, Friends, Parents & Exams) They (అవి)

కాబట్టి I, we, you, he, she, it, and they are pronouns. ఇవే కాకుండా, కిందివి కూడా pronouns:

1) Dad drives me to school (నన్ను మానాన్న school కు కార్లో తీసుకువెళ్తాడు.)/ He gave me the book (అతడు నాకు పుస్తకం ఇచ్చాడు).  Me నన్ను, నాకు - pronouns.

2) She took us to a movie yesterday (ఆమె మమ్మల్ని / మనల్ని నిన్న సినిమాకు తీసుకెళ్లింది)/ She showed us the way to the hotel  (ఆమె మాకు హోటల్‌కు దారిచూపింది). Us - మమ్మల్ని, మాకు, మనల్ని, మనకు pronouns

3) Don't go near the snake. It will kill you (పాము దగ్గరకెళ్లకు. అది నిన్ను చంపుతుంది).

These books give you knowledge. (ఈ పుస్తకాలు నీకు/ మీకు జ్ఞానాన్నిస్తాయి.) You - నిన్ను/ మిమ్మల్ని/ నీకు/ మీకు - pronouns

4) The doctor gave him/ her an injection (డాక్టర్ అతడికి/ ఆమెకు injection ఇచ్చాడు.)/ The doctor examined him/ her (డాక్టర్ అతడిని/ ఆమెను పరీక్షించాడు).

5. He found it = అతడు దాన్ని చూశాడు

I gave it some polish (దానికి నేను మెరుగుపెట్టాను) It = అది/ దాన్ని/ దానికి pronoun

6. We defeated them (మేం వాళ్లను ఓడించాం).

We gave them money (మేం వాళ్లకు డబ్బులు ఇచ్చాం.)

She threw them away (ఆమె వాటిని విసిరేసింది).

She painted them (వాటికి రంగు పూసింది) Them = వాళ్లను/ వాళ్లకు/ వాటిని/ వాటికి - pronoun

So, II set of pronouns:

Me, us, you, him, her, it and them ఇంకా pronouns చూడండి. ఇవి మన విషయాలను తెలియజేస్తాయి.

1) That book is mine (నాది ఆపుస్తకం - Pronoun).

2) This house is ours (మాది ఈ ఇల్లు - Pronoun).

3) The toys are yours. (బొమ్మ్లు మీవే)

4) The clothes are his (ఆ దుస్తులు అతడివి).

5) The jewels are hers (ఆ నగలు ఆమెవి).

6) The elephant is a strong animal. Its trunk is very strong. (ఏనుగు బలమైంది. దాని తొండం చాలా బలమైంది).

7) This building is theirs. (ఈ మేడ వాళ్లది.)

8) Cars have wheels. These tiers are theirs. (కార్లకు చక్రాలుంటాయి. ఈ టైర్లు వాటివి.) 

Pronouns

ఇవికాక ప్రశ్నలకు వాడే Pronouns చూద్దాం: వాటిని Interrogative pronouns అంటారు.

a) What is in that box? = ఆ పెట్టెలో ఏం ఉంది? ఏం ఉంది ఆ పెట్టెలో?

b) Which of these books is yours? ఈ పుస్తకాల్లో ఏది నీది?

c) Who is the President of India? భారత అధ్యక్షుడు ఎవరు?

d) Who do you want to meet? ఎవరిని కలవాలనుకుంటున్నావు నువ్వు?

e) Whose is this pen? (ఈ pen ఎవరిది?) 

Who (ఎవరు?) Whose (ఎవరిది?) వీటిపక్కన మామూలుగా singular verb వస్తుంది.

Who is...?/ Who has....?/ Who goes...?అయితే Who పక్కన వచ్చే verb, దాని తర్వాత వచ్చే సంఖ్యను బట్టి plural అవుతుంది.

Who are they? Who are going there?

ఇలాగే what తర్వాత కూడా మామూలుగా singular verb వస్తుంది.

అయితే subject plural అయితే verb కూడా plural అవుతుంది. Who is he? (he - singular verb, because 'he' is singular.)

Who are these boys? (Boys plural కాబట్టి, who are ...?)

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌