• facebook
  • whatsapp
  • telegram

Very interesting ... Extremely interesting

 Tulasi: Our classmate Sarada is very intelligent, isn't she? The models she has designed for the science fair are very interesting.(మన క్లాస్‌మేట్ శారద చాలా తెలివైంది. సైన్స్ ఫెయిర్‌కు ఆమె తయారుచేసిన నమూనాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.) 

Bhanu: That's true. They are ingenious indeed and fascinating. Of the four she has exhibited two are very intriguing.

(నిజమే. మేధస్సుతో తయారు చేసిన ఆ నమూనాలు నిజంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆమె ప్రదర్శించిన నాలుగింటిలో రెండు ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి.)

Tulasi: They've held the attention of every visitor to the fair. I think she owes it to the stimulating lectures of our professors.

(ప్రతి సందర్శకుడినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ విషయంలో ఆమె ఆసక్తికరంగా బోధించే మన అధ్యాపకులకు రుణపడి ఉంది.)

Bhanu: She is also penning a book. It is a piece of science fiction. I've read the first few chapters of the book and found them very absorbing. It reminded me of the movie "The time machine".

(ఆమె ఒక పుస్తకం కూడా రాస్తోంది. అది శాస్త్రీయ విషయం ఆధారంగా రాస్తున్న కథ. దృష్టి మరల్చకుండా చదివించేలా ఉంటుంది. అది నాకు "The Time machine" సినిమాను గుర్తుకుతెచ్చింది.)

Tulasi: I've seen the movie too. It's really very engrossing. There's never a dull moment in the entire movie. I only wish our Indian movie makers could think of such spellbinding movies.

(ఆ చిత్రాన్ని నేనూ చూశాను. దాన్ని చూస్తున్నంతసేపూ మన దృష్టిని మరల్చుకోలేం. దాంట్లో ఆసక్తి కలిగించని దృశ్యం ఒక్కటి కూడా ఉండదు. మంత్రముగ్ధుల్ని చేసే అలాంటి సినిమాలను మనవాళ్లు కూడా తీయొచ్చు కదా!)

Bhanu: The novel is even better than the movie. The novel is a real page turner.

  (ఆ నవల ఆ చిత్రానికంటే చాలా బాగుంటుంది. ఆపకుండా చదవాలనిపిస్తుంది.)

Notes: 1. Fair = Exhibition = ప్రదర్శన

2. Owe something to somebody = To be in somebody's debt

            = To be grateful

      = ఒకరికి రుణపడి (కృతజ్ఞతతో) ఉండటం.

India owes its freedom to great freedom fighters like Gandhi.

3. Science fiction = A story based on some scientific idea

     = శాస్త్రీయ అంశంపై ఆధారపడిన కథ.

4. Remind = Make somebody remember something

     = గుర్తుచేయడం.

Look at the following words from the conversation above.

      1. Interesting                         2. Fascinating

      3. Intriguing                          4. Held the attention of

      5. Stimulating                         6. Absorbing

      7. Engrossing                         8. Spellbinding

      9. Never a dull moment             10. Page turner

ఇవన్నీ కూడా ఆసక్తికరమైన/ ఆకట్టుకునే/ కళ్లు తిప్పకుండా చేసే/ మంత్రముగ్ధుల్ని చేసే అనే అర్థం ఉన్న మాటలు.

All these words mean "interesting" in varying degrees.

పై మాటలన్నీ వివిధ స్థాయుల్లో 'ఆసక్తి కలిగించే' అనే అర్థం ఉన్నవే.

1. Interesting = Causing you to know about something

                 = తెలుసుకోవాలనిపించే

Attracting your attention = దృష్టిని ఆకర్షించే

a) Vinod: How did you find the game? I couldn't attend because I had take mom to the railway station.

Sitaram: Very interesting, you know. Till almost the end, none was sure of the result. Finally a last minute goal by our team won us the match.

 (చాలా ఆసక్తికరంగా ఉంది. దాదాపు చివరివరకూ ఫలితం గురించి ఎవరూ చెప్పలేకపోయారు. మనవాళ్లు ఆఖరి క్షణంలో చేసిన గోల్‌తో మన జట్టు గెలిచింది.)

b) It is interesting to listen to children singing so well on the TV.

(టీవీలో చిన్న పిల్లలు పాడుతుంటే వినడం ఆసక్తికరంగా ఉంటుంది.) 

2. Fascinating = Extremely interesting

                   = దృష్టి మరల్చకుండా/ కళ్లప్పగించేంత ఆసక్తికరంగా ఉన్న.

a) Savithri: How was your holiday trip?

నీ యాత్ర (హాలిడే ట్రిప్) ఎలా ఉంది?

Satyavanth: The most fascinating of all the places I visited was the Araku Valley. What enchanting scenery you know!(ఆ ఆట ఎలా ఉంది. మా అమ్మను రైల్వేస్టేషన్‌లో దిగబెట్టడానికి వెళ్లడం వల్ల నేను రాలేకపోయాను.)
(నేను సందర్శించిన స్థలాలన్నింటిలో అరకులోయ నన్ను అమితంగా ఆకర్షించింది. అది మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.)     

b) Narayan: Did you watch the total solar eclipse the other day?

(ఇటీవల వచ్చిన సూర్యగ్రహణాన్ని చూశావా?)

Govind: I did of course. It was fascinating to see the Sun's disc so dark. There was darkness all over. Crows flew out in all over the sky in sheer panic.

(చూశాను. సూర్యబింబం అంత చీకటిగా ఉండటం ఆకట్టుకునేలా ఉంది. ఎక్కడ చూసినా చీకటే. కాకులు ఆకాశంలో ఆందోళనగా ఎగిరాయి.)

c) The story of the Mahabharatam is really fascinating.

    (మహాభారత కథ నిజంగా ఆకట్టుకుంటుంది.)

3. Intriguing = Interesting, because something is strange or unusual. = విచిత్రంగా/ మామూలుగా లేకపోవడం వల్ల ఆసక్తి రేకెత్తించే.

If something is intriguing, it is very interesting because it is strange or unexpected.

Intriguing 

a) Shashank: Why are you so absent minded? What are you thinking of?

(ఏంటి అంత పరధ్యానంగా ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు?)

Ramya: It is intriguing to see Akhila here at this time, that too alone.

(అఖిల ఇప్పుడు ఇక్కడ, అదీ ఒంటరిగా కనిపించడం నాకు ఉత్కంఠను కలిగిస్తోంది.) అంటే అఖిల ఇక్కడ ఇప్పుడు ఒంటరిగా ఉండటం అసాధారణ విషయం అందువల్ల Intriguing అనవచ్చు.      

b) Anand: Something extraordinary happened yesterday. I saw Bhagat and Abhi sitting over a table and talking to each other seriously.

(నిన్న ఓ అసాధారణ సంఘటన జరిగింది. భగత్, అభి ఒక టేబుల్ దగ్గర చాలా గంభీరంగా ఏదో మాట్లాడుకుంటున్నారు.)

Bharath: That's really intriguing. Such deadly enemies sitting together! Something is really in the offing.

(అది చాలా విచిత్రంగా, ఆసక్తికరంగా ఉంది. బద్ధ శత్రువులు ఒకచోట కూర్చొని మాట్లాడుకోవడమా! అయితే ఏదో జరగబోతుంది.)

"Intrigue" has another meaning too.

Intrigue = Evil Plot = కుట్ర.

a) Politics are full of deceit and intrigue (రాజకీయాలు మోసంతో, కుట్రతో కూడుకుని ఉంటాయి.)

b) The Prime Minister lost his power and position as a result of the intrigue of the military generals (సైన్యాధిపతుల కుట్ర మూలంగా ప్రధానమంత్రి తన అధికారాన్ని, పదవిని కోల్పోయాడు.)

4. Hold attention = Make someone continue to be interested in listening, writing, reading etc. = తదేకంగా చూస్తూ, వింటూ, చదువుతూ, ఉండిపోయేంత ఆసక్తి కలిగించే/ చాలాసేపు ఆకట్టుకునే.

a) Chidanand: How about going out for a walk?= మామూలైంది కాకపోవడం వల్ల, విచిత్రంగా ఉండి ఆసక్తిని కలిగించేది.

(అలా నడకకు వెళదామా?)Eknadh: Sorry, I can't keep this book down until I complete it. It holds my attention so much.

(సారీ. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివే వరకు పక్కన పెట్టలేను. అంత ఆకట్టుకునేలా ఉంది.)

b) Farook: What's holding his attention so much on the TV? He's (He has) been glued to it for an hour now?

(టీవీలో అంత దృష్టి మరల్చకుండా చూసేంత విషయమేముంది? గంట నుంచీ దానికే అతుక్కుపోయాడు).

Ganesh: Some Breath taking acrobats performed by a yougster of just seven years.

       (ఏడేళ్ల కుర్రాడు ఊపిరిబిగబట్టేలా చేస్తున్న విన్యాసాలు.)

       Acrobats = Circus feats

5. Stimulating = Exiting = అమితాసక్తిని కలిగించే/ ఉత్సాహాన్ని కలిగించే/ ఆలోచనను రేకెత్తించే.

a) Giridhar: I couldn't get you until very late last night? What were you busy with?

(నిన్న రాత్రి చాలా పొద్దుపోయే వరకు నువ్వు నాకు దొరకలేదు? ఏంటీ అంత తీరిక లేకపోవడం?)

Gurunath: We had a stimulating discussion of politics.

 b) Hridaya: I called your home twice and all the answer I got was, you were out somewhere. Where were you?

(మీ ఇంటికి రెండుసార్లు ఫోన్ చేశాను. నువ్వు ఎక్కడికో బయటికెళ్లావని సమాధానం వచ్చింది. ఎక్కడున్నావు?)

Sundari: I was at a stimulating lecture by an expert in space science.

(ఒక అంతరిక్ష నిపుణుడి ఆసక్తికరమైన/ ఆలోచనలు రేకెత్తించే ఉపన్యాసం వింటున్నాను)

6. Absorbing = మనసును, దృష్టిని మరల్చనీయనంత ఆసక్తి/ అనుభూతిని కలిగించే = Holding your attention for a long time because it is very interesting and enjoyable.

a) Brihat: What is it that is so engaging in the book?

(ఆ పుస్తకంలో నిన్ను అంతగా ఆకట్టుకున్న విషయం ఏముంది?)

Charan: It's (It is) an absorbing book telling us how the author rose from being a tramp to be the leader of a popular party.

(ఈ పుస్తకంలో రచయిత, తాను ఓ తిరుగుబోతు స్థాయి నుంచి ప్రజాభిమానం ఉన్న పార్టీ నాయకుడిగా ఎలా ఎదిగాడో ఆసక్తికరంగా వివరించాడు.)

       Tramp = Loafer

   = తిరుగుబోతు(మేము ఆలోచనలు రేకెత్తించే రాజకీయ చర్చలో ఉన్నాం.)

b) Dheeraj: What's your brother now?(మీ తమ్ముడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు?)

Naresh: He finds Ornithology an all absorbing hobby. He is most of the time out in the wilds looking for rare birds.

(అతడికి పక్షుల అధ్యయనం (Ornithology) ఎంతో ఆసక్తికరమైన అనుభూతిని కలిగించే ప్రక్రియ అయిపోయింది. రోజులో ఎక్కువ సమయం అరుదైన పక్షులను చూసేందుకు అడవుల్లో గడుపుతాడు)      

c) It was an absorbing dance performance = అది దృష్టి మరల్చనీయని నాట్య ప్రదర్శన.

7. Engrossing = (A book/ movie/ story/ your own work) so interesting that you do not notice what is going on around you.

   (పక్కన ఏం జరుగుతున్నదీ గమనించలేనంత తన్మయత్వం కలిగించే పుస్తకం/ సినిమా/ కథ/ మనం చేస్తున్న పని)

     a) Damodar: Why is she in hospital?

   (ఆమె ఆస్పత్రిలో ఎందుకు ఉంది?)

Satyam: She was so engrossed in the show she was watching on the TV that she did not notice the thief entering the house and attacking her.

(మైమరపించే టీవీ ప్రదర్శన చూస్తూ... ఇంట్లోకి దొంగ ప్రవేశించి ఆమెపై దాడి చేయడాన్ని గమనించలేకపోయింది). 

     Engrossing = తన్మయత్వం కలిగించే

     Engrossed = మైమరచిపోయే

b) Sakhi: Shall We call Smitha? (స్మితకు ఫోన్ చేద్దామా?)

Chandana: I'm afraid she won't take our call. She is usually engrossed in listening to music at this time.

(ఫోన్‌కు బదులిస్తుందా అని నా అనుమానం. మామూలుగా ఈ సమయంలో ఆమె సంగీతం వింటూ మైమరచిపోతుంది.)

8. Spellbinding = (A story/ film/ music etc.,) so interesting that you cannot take your eyes away from it/ think of anything else = మంత్రముగ్ధుల్ని చేసే/ మన కళ్లు తిప్పకుండా ఉండేంత ఆసక్తికరంగా ఉన్న (కథ, సినిమా, సంగీతం లాంటివి.)

Spell = Magic (మాయాజాలం)

Binding = Making you motionless.

a) Ajitha: How was the movie, "Titanic" that you went to yesterday?

(నిన్న నువ్వు చూసిన Titanic సినిమా ఎలా ఉంది?)

Sanjana: Spellbinding. I could not turn my eyes off the screen.

(ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే సినిమా అది. చూస్తున్నంత సేపూ కళ్లు తిప్పుకోలేకపోయాను.)

b) Durga: You missed a once-in-a-lifetime opportunity yesterday.

(నిన్న నువ్వు జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నావు.)

Vaidehi: What are you taking of? (దేని గురించి మాట్లాడుతున్నావు?)

Durga: You missed the spellbinding performance of our friend Kavitha on the TV.

(మన స్నేహితురాలు కవిత మంత్రముగ్ధుల్ని చేసేవిధంగా ఇచ్చిన టీవీ ప్రదర్శనను కోల్పోయావు.)

9. Never a dull moment = అనాసక్తికరం కాని క్షణం అంటూ లేకపోవడం = మొత్తం ఆసక్తికరంగా ఉండటం (సినిమా, కథ, పుస్తకం, ప్రదర్శన లాంటివి)

a) Ravi: You've been (you have been) talking all the time about the movie, was it so great?

(ఇంతవరకూ ఆ సినిమా గురించే మాట్లాడుతున్నావు? అంత బాగుందాయేం?)

Omkar: There was never a dull moment with Piers Brosnan as James Bond.Spellbinding = మంత్రముగ్ధుల్ని చేసే

(జేమ్స్‌బాండ్ పాత్రలో Piers Brosnan నటించడంతో ఆ సినిమాలో ఆసక్తికరం కాని క్షణం అంటూ లేదు.)b) There's never a dull moment with all my sister's children at home.

(మా అక్క పిల్లలందరూ ఇంట్లో ఉండటంతో నిస్తేజంగా ఉండే క్షణమే లేదు = సందడిగా ఉంది.) 

10. A Page turner = (A book) so interesting that you keep turning the pages to know what happens next.

మరుక్షణంలో ఏమవుతుందో అనే ఉత్సుకతతో ఆపకుండా పేజీలు తిప్పేలా చేసే కథ/ పుస్తకం.)

a) Sajjan: Thank you very much. (నీకు చాలా ధన్యవాదాలు)

Bhaskar: What for? (ఎందుకు?)

Sajjan: The book you lent me is a page turner. I couldn't put the book down until I completed it.

    b) Arthur Conan Doyle is the writer of a number of page turners.(Arthur Conan Doyle (Sherlock Holmes నవలల రచయిత) చాలా ఆసక్తి కలిగించే కథల రచయిత.

    ఈ lesson లో "Interesting" అనే అర్థం వచ్చే వివిధ Expressions చూశాం కదా! వీటన్నిటి అర్థం దాదాపుగా ఒకటే అయినా వాటిలో ఎక్కువ, తక్కువ భేదాలే కాకుండా వాటిని వాడాల్సిన సందర్భాల్లో కూడా చాలా తేడాలున్నాయని గమనించండి. అర్థ సామీప్యం ఆధారంగా ఈ పాఠ్యాంశంలోని మాటలను కింది groups గా విభజించవచ్చు.(నిన్న నువ్వు నాకు ఇచ్చిన పుస్తకం అత్యంత ఆసక్తికరంగా ఉంది. చదవడం పూర్తయ్యేవరకూ పక్కన పెట్టలేకపోయాను.)

   1. Interesting                                        2. Fascinating

      3. Holding attention                             4. Absorbing

      5. Spellbinding                                     6. Engrossing

      7. There's never a dull moment            8. A page turner

      9. Couldn't put it down                         10. Intriguing

       వీటిలో మొదటి మూడింటిని కథలు, పుస్తకాలు, సినిమాలకు వాడవచ్చు.

      4, 5, 6 మాటలను ప్రదర్శనల (Performances)కు, పుస్తకాలు, కథలు, మనం చేస్తున్న పనులకు వాడతాం. 7, 8, 9 పదాలను పుస్తకాలు, కథల పుస్తకాలకు మాత్రమే వాడతాం.

      వీటన్నింటికీ 'ఆసక్తికరమైన/ ఆకట్టుకునే/ మైమరపించే/ తన్మయత్వం కలిగించే/ మంత్రముగ్ధుల్ని చేసే అనే అర్థాలు సాధారణం.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌