* ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
‣ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
9 ప్రధానాంశాల ఆధారంగా బడ్జెట్: నిర్మలా సీతారామన్
‣ ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్ఎంఈపై దృష్టి
‣ వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
‣ వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
నిరుద్యోగుల కోసం మూడు పథకాలు:
‣ ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలు
‣ ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటి అమలు
‣ సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో చెల్లింపు
‣ గరిష్ఠంగా రూ.15 వేలు చెల్లింపు. నెలకు గరిష్ఠంగా రూ.1 లక్ష లోపు వేతనం ఉన్నవారు అర్హులు.
‣ 210 లక్షల మంది యువతకు లబ్ధి
ప్రజల మద్దతుతో మూడోసారి అధికారంలోకి
‣ ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం
‣ దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
‣ అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
‣ మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్
‣ బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
‣ బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గింపు
‣ ప్లాటినమ్పై 6.4 శాతాననికి కుదింపు
క్యాన్సర్ రోగులకు ఊరట
‣ క్యాన్సర్ రోగుల మందులపై సుంకం ఎత్తివేత
‣ మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపు
ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం
‣ ద్రవ్యలోటు జీడీపీలో 4.9 శాతానికి తగ్గుతుందని అంచనా
‣ మరింత హేతుబద్ధంగా జీఎస్టీ రేట్లు
‣ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలు మరింత సరళతరం
NPSలో మార్పులు
‣ ఎన్పీఎస్ పథకంలో మార్పులు
‣ మైనర్లూ చేరేందుకు అవకాశం
‣ ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి పెద్దపీట
‣ కాశీ తరహాలో గయ అభివృద్ధి
‣ బిహార్ రాజ్గిరి జైన్ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక
‣ టూరిజం కేంద్రంగా నలందా అభివృద్ధి
వరద నివారణకు బిహార్‌కు రూ.11వేల కోట్లు
‣ వరదల వల్ల బిహార్ ఏటా నష్టపోతోంది
‣ వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11వేల కోట్లు కేటాయింపు
‣ వరద నివారణకు అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక నిధులు
స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
‣ స్టాంప్ డ్యూటీని పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
‣ మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు
‣ ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు..
‣ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటిస్తున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు ఒడుదొడుకుల్లో చలిస్తున్నాయి. ఉదయం 11:55 గంటలకు సెన్సెక్స్ 172 పాయింట్లు నష్టపోయి 80,329 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 56 పాయింట్లు కుంగి 24,452 వద్ద ట్రేడవుతోంది.
మౌలిక సదుపాయాలకు ₹11.11 లక్షల కోట్లు
‣ మౌలిక సదుపాయల కల్పనకు బడ్జెట్లో మరోసారి పెద్దపీట
‣ బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయింపు
‣ జీడీపీలో 3.4 శాతానికి సమానం
గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్లు
‣ గృహ నిర్మాణంపై బడ్జెట్లో ప్రకటన
‣ అర్బన్ హౌసింగ్ కోసం ఐదేళ్లలో రూ.2.2 లక్షల కోట్లు కేటాయింపు
కోటి మందికి ఉద్యోగ కల్పన
‣ 500 పెద్ద కంపెనీల్లో కోటికి మంది యువతకు ఉద్యోగాల కల్పన
‣ వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు
‣ 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు
‣ పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం
‣ పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం
గ్రామీణ భారతానికి రూ.2.66 లక్షల కోట్లు
‣ బడ్జెట్లో గ్రామీణ అభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయింపు
‣ ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు
బిహార్‌కు ఆర్థిక సాయం
‣ బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల నిధుల ద్వారా బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం
‣ బిహార్‌లో జాతీయ రహదారులకు రూ.20వేల కోట్లు
విద్యార్థులకు రూ.10లక్షల రుణం
‣ దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు రూ.10లక్షల వరకు రుణాలు
అమరావతికి రూ.15వేల కోట్ల ప్రత్యేక సాయం
‣ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
‣ ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం
‣ అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు
‣ పోలవరానికి పెద్దపీట.. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి
‣ రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు
‣ విశాఖ- చెన్నై కారిడార్‌లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు
మొబైల్ ఫోన్లపై సుంకం తగ్గింపు..
‣ మొబైల్ ఫోన్లు, మొబైల్ పీసీడీఏ, మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి తగ్గింపు
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
‣ స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు
కొత్త పన్ను విధానంలో మార్పులు
‣ కొత్త పన్ను విధానంలో మార్పులు చేసిన ఆర్థిక మంత్రి
‣ సున్నా నుంచి రూ.3 లక్షల వరకు పన్ను సున్నా
‣ రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
‣ రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
‣ రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
‣ రూ.12- 15 లక్షల 20 శాతం శాతం పన్ను
‣ రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను
‣ కొత్త విధానంలో రూ.17,500 పన్ను ఆదా
క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ
‣ లాంగ్ టర్మ్ గెయిన్స్‌పై 12.5 శాతం పన్ను
‣ క్యాపిటల్ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు
‣ స్టార్టప్‌లకు ప్రోత్సాహకం.. ఏంజెల్ ట్యాక్స్ రద్దు