• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్ 2023-24

ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. పోతన పద్యంతో, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వ్యాఖ్యలతో తన బడ్జెట్‌ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఆటుపోట్లను అధిగమించామని మంత్రి బుగ్గన అన్నారు. ఈ బడ్జెట్‌ సుస్థిర అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామన్నారు. 
బడ్జెట్‌ కేటాయింపులు ఇలా.. 
 వ్యవసాయ రంగానికి రూ.11,589.48 కోట్లు
 సెకండరీ విద్యకు రూ.29,690.71 కోట్లు
 వైద్యారోగ్య శాఖకు రూ.15,882.34 కోట్లు
 పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి రూ.15,873.83 కోట్లు
 రవాణా, ఆర్‌ అండ్‌ బీ రూ.9,118.71 కోట్లు
 విద్యుత్‌ శాఖకు రూ.6,546.21 కోట్లు
 ఎస్సీ కార్పొరేషన్‌ రూ.8,384.93 కోట్లు
 ఎస్టీ కార్పొరేషన్‌ రూ.2,428 కోట్లు
 బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు
 ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6,165 కోట్లు
 కాపు కార్పొరేషన్‌కు రూ.4,887 కోట్లు
 క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ రూ.115.03 కోట్లు.

Posted Date: 16-03-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం