• facebook
  • whatsapp
  • telegram

Canada students : కెనడాలో వారానికి 24 గంటలే పని

* కెనడాలో విదేశీ విద్యార్థులకు సంబంధించి అమల్లోకి కొత్త నిబంధన

ఒట్టావా: కెనడాలో చదువుకుంటున్న భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులు సెప్టెంబరు నుంచి విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల వారానికి 24 గంటలు మాత్రమే పనిచేసుకునేందుకు వీలు కల్పించే కొత్త నిబంధన ఒకటి  ఏప్రిల్ 30 నుంచి అమల్లోకి వచ్చింది. ‘‘విద్యాసంస్థ ప్రాంగణం వెలుపల 20 గంటలకుపైగా పని చేసుకునే ప్రస్తుత తాత్కాలిక విధానం ఏప్రిల్ 30తో ముగుస్తుంది. దాన్ని పొడిగించడానికి బదులు వారానికి 24 గంటలకు పరిమితం చేస్తున్నాం’’ అని కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ వ్యవహారాల శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ఏప్రిల్ 30 న ఓ ప్రకటనలో తెలిపారు. కెనడాకు వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు వారానికి 20 గంటలు పని చేసుకునే అవకాశం ఉండేది. కొవిడ్ -19 మహమ్మారి విజృంభణ సమయంలో దేశంలో నెలకొన్న కార్మికుల కొరతను పరిష్కరించేందుకు ట్రూడో ప్రభుత్వం నిబంధనలు సడలించింది. వారానికి గరిష్ఠంగా 40 గంటలు పని చేసుకొనే వీలు కల్పించింది. ఈ వెసులుబాటు ఏప్రిల్-2024తో ముగిసింది. కొత్త పని గంటల విధానం మాత్రం సెప్టెంబరు నుంచి అమల్లోకి వస్తుంది. విదేశీ విద్య కోసం చూసే భారత యువతకు కెనడా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది. 2022లో కెనడా ప్రభుత్వ గణాంకాల ప్రకారం..ఆ దేశంలో 3,19,130 మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.  

చదువులో వెనకబడిపోతున్నారు..

వారానికి 28 గంటల కంటే ఎక్కువ పనిచేసే విదేశీ విద్యార్థులు.. చదువులో వెనకబడిపోతున్నట్లు అమెరికా, కెనడాలో ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో తేలినట్లు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా వారానికి 24 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసే విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపివేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.


మరింత సమాచారం... మీ కోసం!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.