• facebook
  • whatsapp
  • telegram

Schools: పాఠశాలల్లో వసతుల కల్పనకు ఆర్థిక సంఘం నిధులు

అనుమతించిన కేంద్ర ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: గ్రామాల్లో పాఠశాలల్లో వసతుల కల్పన కోసం ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసే వెసులుబాటును గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి సునీల్‌కుమార్‌ రాష్ట్రాలకు సమాచారం పంపారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పాఠశాలల భవనాలకు మరమ్మతులు, నిర్వహణ, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు, విద్యుత్తు, అంతర్జాల సదుపాయం కల్పించుకోవడం, క్రీడా మైదానాల నిర్వహణకు ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

Posted Date : 28-09-2021