ఈనాడు, అమరావతి: కేంద్ర ప్రాయోజిత పథకం కింద పీజీ వైద్య విద్యలో అదనంగా కేటాయించిన 630 సీట్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.756 కోట్లు ఖర్చుపెట్టేందుకు పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 688 వైద్య సీట్ల కోసం ప్రతిపాదనలు పంపగా.. కేంద్రం 630 సీట్లకు అంగీకారం తెలిపింది. కేటాయించిన మొత్తంతో సంబంధిత వైద్య కళాశాలల్లో ల్యాబ్, తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ప్రతిపాదించిన మొత్తంలో కేంద్రం రూ.453.6 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.302.4 కోట్ల చొప్పున భరిస్తాయి. విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాలకు పీజీ వైద్య విద్యలో అదనంగా 128 సీట్లు, ఒంగోలు కళాశాల-79, తిరుపతి-75, విజయవాడ-71, కడప-69, అనంతపురం-65, కాకినాడ-46, కర్నూలు-41, గుంటూరు కళాశాలకు 34 చొప్పున, శ్రీకాకుళం, నెల్లూరు వైద్య కళాశాలలకు మిగిలిన సీట్లు కేటాయింపు జరిగినట్లు ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డెకరేషన్లకు కొన్ని కోర్సులు!
‣ వేదికపై ధీమాగా... నలుగురూ మెచ్చేలా!
‣ నిర్మాణ రంగంలో కొన్ని కోర్సులు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.