• facebook
  • whatsapp
  • telegram

Admissions: 27 నుంచి క్రీడా పాఠశాల ప్రవేశ ఎంపికలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌ రాష్ట్ర క్రీడా పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి 4, 5వ తరగతుల్లో ప్రవేశాలకు తుది ఎంపికలు అక్టోబరు 27, 28 తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్వహిస్తామని శాప్‌ వైస్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. 4వ తరగతిలో ప్రవేశానికి జిల్లా స్థాయిలో ఎంపికైన బాలబాలికలు అక్టోబరు 27వ తేదీన, 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికైన బాలబాలికలు అక్టోబరు 28వ తేదీన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సంబంధిత ధ్రువపత్రాలతో సంబంధిత తేదీల్లో ఉదయం 7 గంటలకు వర్సిటీలోని వ్యాయామ విద్యా విభాగంలో హాజరవ్వాలని ఆయన సూచించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఇండియ‌న్ ఆర్మీ - 10+2 టెక్నిక‌ల్ ఎంట్రీ స్కీమ్

ఏఐఎంఏ, మ్యాట్-డిసెంబ‌రు 2021 

ఓఎన్‌జీసీలో 309 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు

To get back at some body

ప్ర‌భుత్వ ఉద్యోగ సాధ‌న‌కు ప‌న్నెండు సూత్రాలు

Posted Date : 26-10-2021