* మే 5న ప్రధాన పరీక్ష
* మొత్తం 1,524 ఖాళీల భర్తీ
ఈనాడు ప్రతిభ డెస్క్: న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్సెట్)-6 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదయ్యాయి. ఈ పరీక్ష ఏప్రిల్ 14న జరిగిన విషయం తెలిసిందే. ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మే 5న ప్రధాన పరీక్ష జరుగనుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.9300- రూ.34800 జీతంతో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది. నార్సెట్-6 ద్వారా మొత్తం 1,524 ఖాళీల భర్తీ కానున్నాయి.
నర్సింగ్ ఆఫీసర్ (నార్సెట్-6) ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.