• facebook
  • whatsapp
  • telegram

AP DEECET: ఆగ‌స్టు 9 నుంచి డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌

* ప్రైవేటు కళాశాలల అనుమతులు రద్దు

ఈనాడు, అమరావతి: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఎల్‌ఈడీ) ప్రవేశాలకు నిర్వహించిన డీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది ఒక్క ప్రైవేటు కళాశాల లేదు. రాష్ట్రంలోని 780 ప్రైవేటు డీఎడ్‌ కళాశాలల అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. వీటిల్లో కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అనుమతుల కోసం పత్రాలను సమర్పించాయి. ఈ పత్రాలు సరైనవి కావని పేర్కొంటూ అనుమతులను నిరాకరించింది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో ఈ ఏడాది ఒక్క డీఎడ్‌ కళాశాల కూడా కౌన్సెలింగ్‌లో లేవు. రాష్ట్ర వ్యాప్తంగా 14 ప్రభుత్వ డైట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 1,650 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డీఈసెట్‌కు 5,800మంది హాజరు కాగా.. 4,800 మంది అర్హత సాధించారు. కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను కన్వీనర్‌ దేవానందరెడ్డి విడుదల చేశారు. ఆగ‌స్టు 14 వరకు ఆన్‌లైన్‌లో కళాశాలలు, సీట్ల ఎంపికకు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవచ్చని, 16-18వరకు సీట్ల కేటాయింపు చేస్తామని వెల్లడించారు. ప్రవేశాల ప్రాథమిక లేఖలను 19న ఇస్తామని, జిల్లా డైట్లలో 20-22 వరకు విద్యార్హత ధ్రువపత్రాలు పరిశీలిస్తామని వెల్లడించారు. ఆగ‌స్టు 31 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 'మహీంద్రా'లో కొత్త ఎంటెక్‌ కోర్సులు

‣ సరిహద్దు రహదారుల సంస్థలో ఉద్యోగాలు

‣ మేనేజ్‌మెంట్‌ విద్యలో ఆకర్షణీయ కోర్సులు

‣ ఫెయిల్ అయ్యారా... ఏం పర్లేదు!

‣ ఇంటర్‌లో ఏ గ్రూప్‌ను ఎంచుకోవాలి?

‣ స్వయంగా నేర్చుకుందాం

‣ మారిన పరిస్థితుల కోసం మరో వ్యూహం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.