• facebook
  • whatsapp
  • telegram

ఏపీ ఈఏపీసెట్‌-2021 షెడ్యూలు విడుద‌ల‌

 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈఏపీ(ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ) కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌-2021 షెడ్యూలును మంత్రి ఆదిమూల‌పు సురేశ్ విడుద‌ల చేశారు. ఎంసెట్‌కు బ‌దులుగా ఈప్‌సెట్ నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. జూన్ 24 నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నుంది. ద‌ర‌ఖాస్తు ప్రక్రియ‌ జూన్ 26 నుంచి ప్రారంభం కానుండ‌గా.. జులై 15 తుది గ‌డువు. ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి పేర్కొన్నారు. క‌రోనా దృష్ట్యా అధిక కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ను చేప‌డ‌తామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఈమేర‌కు విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

Posted Date : 19-06-2021