• facebook
  • whatsapp
  • telegram

AP Polycet: పాలిసెట్‌లో అభ్యర్థుల కంటే సీట్లే ఎక్కువ  

 

ఈనాడు, అమరావతి: ఏపీ పాలిసెట్‌లో అర్హత సాధించిన వారికంటే పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది 64,187 మంది అర్హత సాధించగా.. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటులో కలిపి 69,724 సీట్లు ఉన్నాయి. విద్యార్థులందరూ ప్రవేశాలు పొందినా ఇంకా 5 వేలకు పైగా సీట్లు మిగిలిపోనున్నాయి. గత నాలుగేళ్లుగా ప్రవేశ పరీక్ష రాసేవారి సంఖ్య తగ్గుతోంది. పాలిటెక్నిక్‌ తర్వాత ఉద్యోగాలు సరిగా రాకపోవడం, వచ్చినా వేతనాలు తక్కువ కావడంతో విద్యార్థుల ఆసక్తి తగ్గుతోంది. పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారిలో చాలామంది ఇంజినీరింగ్‌కు వెళ్లిపోతున్నారు.
 

Posted Date : 16-09-2021