• facebook
  • whatsapp
  • telegram

B-category : ఇంజినీరింగ్ బి-కేటగిరి ప్రవేశాల దరఖాస్తులు అక్టోబరు 5 వరకు స్వీకరించాల్సిందే

 

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్ బి-కేటగిరి ప్రవేశాల కోసం అక్టోబరు 5 వరకు కళాశాలలు తప్పనిసరిగా దరఖాస్తులు  స్వీకరించాలని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్‌సీ) స్పష్టం చేసింది. కొన్ని ఇంజినీరింగ్‌ కళాశాలలు దరఖాస్తులు స్వీకరించడం లేదన్న ఫిర్యాదులపై స్పందించిన టీఏఎఫ్ఆర్‌సీ.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 5వ తేదీ తర్వాతే మిగతా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. ఒకవేళ కళాశాలలు దరఖాస్తులు స్వీకరించక పోతే.. తమకు సమర్పించవచ్చని విద్యార్థులకు సూచించింది. అక్టోబరు 1 వరకు తమకు దరఖాస్తులు సమర్పించవచ్చని.. తాము సంబంధిత కళాశాలలకు దరఖాస్తులను పంపిస్తామని వివరించింది.

Posted Date : 24-09-2021