• facebook
  • whatsapp
  • telegram

BSC Nursing: 23 నుంచి బీఎస్సీ నర్సింగ్‌ ప్రవేశాలకు దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్‌ 22న ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 23 ఉదయం 9 నుంచి అక్టోబర్‌ 3న సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తు నింపే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216 నంబర్లకు.. నిబంధనలను తెలుసుకోవాలనుకుంటే 9490585796, 8500646769 నంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫోన్‌ చేయాలని వర్సిటీ వర్గాలు సూచించాయి. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నాయి.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.