• facebook
  • whatsapp
  • telegram

Certificate Course: సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 8న సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభం

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్రం, ఎలక్ట్రానిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో నవంబరు 8వ తేదీ నుంచి ‘హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్‌’ సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల నైపుణ్యాల పెంపుదల, స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ కోర్సు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 94917 53148, 99632 38005 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని ఆమె సూచించారు.

Posted Date : 28-10-2021