• facebook
  • whatsapp
  • telegram

SRR: ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ అటానమస్‌ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలో భాగంగా ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం సెప్టెంబరు 23న నిర్వహించారు. 254 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆటలు, క్రీడలు 79 మంది, ఎన్‌సీసీ 90, ఎన్‌ఎస్‌ఎస్‌/ఎక్స్‌ట్రా కర్క్యులర్‌ యాక్టివిటీకి 14, విభిన్న ప్రతిభావంతులు 61, కాప్‌కు సంబంధించి 10 మంది విద్యార్థులు ఆన్‌లైన్లో పేర్లు నమోదు చేసుకుని, ధ్రువపత్రాలు పరిశీలన చేయించుకున్నారని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి తెలిపారు.

Posted Date : 24-09-2021