ఈనాడు, అమరావతి: ఎండలు మండిపోతున్నా డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో తరగతులు, పరీక్షలు నిర్వహిస్తుండటంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకుపైగా నమోదవుతున్నా తరగతులు నిర్వహించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 2022-23లో సెలవులు లేకుండా అకడమిక్ ప్రణాళిక రూపొందించారు. దీంతో 2022-23 విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే 2023-24 సంబంధించి తరగతులు ప్రారంభించారు. కరోనా సమయంలో నష్టపోయిన తరగతులను సర్దుబాటు చేసేందుకు అంటూ ఉన్నతవిద్యాశాఖ ఈ కేలండర్‌ను రూపొందించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.