• facebook
  • whatsapp
  • telegram

DEECET: డీఈఈసెట్‌ ఫలితాలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌:  రెండేళ్ల డీఎడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్‌ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ సెప్టెంబ‌రు 15న‌ సాయంత్రం విడుదల చేసింది. తెలుగు మాధ్యమంలో 1,617 మంది (71.70 శాతం), ఆంగ్ల మాధ్యమంలో 1,996 మంది, ఉర్దూ మాధ్యమంలో 298 మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మాధ్యమంలో గడిల అనోద, ఆంగ్లంలో వడ్లగేరి సుదేంద్రరెడ్డి, ఉర్దూలో తస్మియా ఖుద్సీయా ప్రథమ ర్యాంకులు సాధించారని కన్వీనర్‌ శ్రీనివాసాచారి తెలిపారు. సెప్టెంబ‌రు 16న‌ నుంచి ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.

Posted Date : 16-09-2021