• facebook
  • whatsapp
  • telegram

మెషీన్‌ లెర్నింగ్‌లో.. టెక్‌ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ  

* అమెజాన్‌ ఇండియా

దిల్లీ: పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులకు సరికొత్త సాంకేతికత, మెషీన్‌ లెర్నింగ్‌(ఎంఎల్‌)లో సమగ్ర నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు అమెజాన్‌ ఇండియా జూన్ 13న‌ ప్రకటించింది. ఇందుకోసం ‘ఎంఎల్‌ సమ్మర్‌ స్కూల్‌’ కార్యక్రమం ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. ఇందులో శిక్షణకు అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపికచేసి వర్చువల్‌ తరగతుల్లో శిక్షణ ఇస్తామంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన టెక్‌ కళాశాలల్లో బ్యాచులర్‌, మాస్టర్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రీఫైనల్‌/ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులని పేర్కొంది.
 

Posted Date : 14-06-2021