1. TS Jobs: మరో 1,663 పోస్టుల భర్తీకి అనుమతి
ఈనాడు, హైదరాబాద్: నీటిపారుదల, రహదారులు-భవనాల శాఖతోపాటు మరో రెండు శాఖలతో కలిపి 1,663 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వీటిలో 80 శాతానికిపైగా ఇంజినీరింగ్ రంగాలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు జులై 2న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు వేర్వేరుగా నాలుగు ఉత్తర్వులు జారీ చేశారు. నీటిపారుదల శాఖలో ఎక్కువ సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని 19 ప్రాదేశిక జలవనరుల ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ఇంజినీర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. EAPCET: ఈఏపీ సెట్‌కు నిమిషం నిబంధన
ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌కు నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 7.30 గంటలు, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అనుమతిస్తామని, అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ లేదని, ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తామని వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. VIDYADHAN: పేద విద్యార్థులకు ‘విద్యాదాన్’ స్కాలర్షిప్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు విద్యాదాన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందజేయనుంది. ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్షిప్ ఇవ్వనుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. TS EPASS: విదేశీ విద్యకు చేయూత
ఈనాడు, హైదరాబాద్: ప్రతిభ ఉండి ఆర్థిక స్థోమత లేని పేద, దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు మంచి అవకాశం. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ‘సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం’ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా తదితర దేశాల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులు చదివేందుకు రూ.20 లక్షల వరకూ ఆర్థిక సాయం చేస్తుంది. విమాన ప్రయాణ ఛార్జీల కోసం అదనంగా రూ.60 వేలు ఇస్తుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. JEE: జేఈఈ మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గత నెల 23 నుంచి 29 వరకు జరిగిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత పేపర్-1, 2 పరీక్షల ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) జులై 2న వెబ్సైట్లో విడుదల చేసింది. కీపై అభ్యంతరాలుంటే జులై 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తెలియజేయవచ్చని తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.