• facebook
  • whatsapp
  • telegram

వైద్య పోస్టుల దరఖాస్తులో తప్పుల దిద్దుబాటుకు వెసులుబాటు

* ఆగస్టు 14 లోగా దరఖాస్తు చేసుకునే వారికే అవకాశం

 

 

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న 969 వైద్యుల పోస్టుల దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం లభించింది. ప్రజారోగ్య విభాగంలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 211 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌/ జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు గత జూన్‌ 15న నియామక ప్రకటన వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14న సాయంత్రం 5 గంటలలోపు https://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు సుమారు 3500 దరఖాస్తులొచ్చాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు తమ సమాచారాన్ని తప్పుగా పొందుపర్చారు. కొందరు తమ మార్కులను, మరికొందరు ఒక ధ్రువీకరణ పత్రానికి బదులుగా మరొకటి అప్‌లోడ్‌ చేశారు. ఇలా పలు తప్పులు దొర్లినట్లుగా అభ్యర్థుల నుంచి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీకి వినతిపత్రాలొచ్చాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం తప్పులు దిద్దుబాటుకి మరోసారి అవకాశం కల్పించింది. అయితే ఆగస్టు 14న తుదిగడువు లోగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో.. వారికే దిద్దుబాటుకు అవకాశం ఉంటుందని ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ తేల్చిచెప్పింది. ఆగస్టు 17న ఉదయం 10 గంటల నుంచి 24న సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుదారులు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తప్పులను సరిదిద్దుకోవచ్చని ఆగస్టు 12న విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ పేర్కొంది. 
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ శారీరక సామర్థ్య పరీక్షలకు సిద్ధమవుతున్నారా?

‣ ఇంజినీరింగ్‌కి ఐఐటీ - మద్రాస్‌ టాప్‌!

‣ ఆర్మీలో 191 టెక్నికల్‌ పోస్టులు

‣ సన్నద్ధతకు తుది మెరుగులు!

‣ ఒత్తిడిని వదిలించుకోవచ్చు!

‣ మీడియాలో ప్రవేశానికి కొన్ని కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.