• facebook
  • whatsapp
  • telegram

TSLPRB: ఎస్సై పరీక్షలో 8 ప్రశ్నల తొలగింపు

* ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని నిర్ణయం.. కీ విడుదల

* 52 మార్కులు వస్తే గట్టెక్కినట్లే

 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ‌లో నిర్వ‌హించిన  ఎస్సై ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నపత్రంలో ఏకంగా 8 తప్పులు దొర్లాయి. మరో 6 ప్రశ్నలకు ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆధ్వర్యంలో 554 పోస్టులకు ఆగ‌స్టు 7న నిర్వహించిన పరీక్ష ‘కీ’ని ఆగ‌స్టు 12న  విడుదల చేశారు. ఈ సందర్భంగా తప్పుల విషయం వెల్లడైంది. ఇంగ్లీష్‌-తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి విదితమే. తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో గట్టెక్కినట్లే. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించినట్లవుతుంది. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘ఎ’ బుక్‌లెట్‌లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి బబ్లింగ్‌ చేసినా మార్కులిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకటికంటే ఎక్కువ సమాధానాలున్న ప్రశ్నలకు సైతం మార్కులు కలపాలనే వాదన వినిపిస్తోంది. ‘తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులున్నందున పలువురు అభ్యర్థులు వాటిని వదిలేసే అవకాశముంది. దీంతో బహుళ సమాధానాలున్న ప్రశ్నలకూ మార్కులు కలపాలి’ అని అక్షర సర్కిల్‌ నిర్వాహకుడు విష్ణువర్ధన్‌ డిమాండ్‌ చేశారు.
అభ్యంతరాలపై 15 వరకు చెప్పొచ్చు..

పరీక్ష ‘కీ’ని www.tslprb.in  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఆగ‌స్టు 12న తెలిపారు. కీపై అభ్యంతరాలుంటే వాటిని.. వెబ్‌సైట్లో పొందుపరచిన ప్రత్యేక నమూనాపత్రం ద్వారా ఆగ‌స్టు 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ తెలపవచ్చని వెల్లడించారు. ప్రతి ప్రశ్నను వేరువేరుగా సమర్పించాలని, సంబంధిత ధ్రువపత్రాలను జతచేయాలని ఛైర్మన్‌ స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని, వ్యక్తిగతంగా ఇచ్చే అభ్యర్థనలను స్వీకరించబోమని వెల్లడించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పైతాన్‌తో కెరియర్‌ పరుగులు!

‣ ఇంటర్న్‌షిప్‌ చేసేముందు ఇవి చూసుకోండి!

‣ ఆన్‌లైన్‌లో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

‣ ఎంపీసీ తర్వాత ఏం చేయవచ్చు?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.