ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే: యూజీ ఆయుష్ వైద్య విద్య సీట్ల భర్తీకి ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ‘మాప్ అప్’ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. వర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లో బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, నేచురోపతి, బీఎస్‌వైసీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 5న ఉదయం 8 గంటల నుంచి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ సూచించింది. ఆలిండియా కోటాలో కాళోజీ, ఎన్టీఆర్ వర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు పొందిన వారు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని పేర్కొంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.