• facebook
  • whatsapp
  • telegram

IIT Delhi: దిల్లీ ఐఐటీలో ఎనర్జీ ఇంజినీరింగ్‌ కోర్సు 

 

ఈనాడు, దిల్లీ: దిల్లీ ఐఐటీలో కొత్తగా బీటెక్‌లో ఎనర్జీ ఇంజినీరింగ్‌ కోర్సు ప్రారంభించారు. 2021 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దీనిని ఎంచుకోవచ్చు. 2021-22 విద్యా సంవత్సరంలో 40 మందికి ప్రవేశం కల్పించనున్నారు. ఇంధన, పర్యావరణపరమైన సవాళ్లను అధిగమించేలా మానవ వనరుల అభివృద్ధికి ఈ కోర్సు ప్రారంభించినట్లు ఐఐటీ వర్గాలు తెలిపాయి. ఇంధన రంగంలో కెరీర్‌ ఎంచుకోవాలనుకున్నవారు దీనిలో చేరొచ్చని, విద్యార్థులు ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యకు వెళ్లవచ్చని పేర్కొన్నాయి. 

Posted Date : 19-10-2021