ఈనాడు, అమరావతి: దిల్లీకి చెందిన ఎన్‌ఐఐటీ ఫౌండేషన్ రూపొందించిన కోర్సులను ఉన్నత విద్యాసంస్థల్లో అమలు చేసేందుకు ఉన్నత విద్యామండలి జనవరి 23న ఒప్పందం కుదుర్చుకుంది. ఫౌండేషనల్, ఉపాధి కల్పించే కోర్సులను ఎన్‌ఐఐటీ రూపొందించింది. వీటిని అమలు చేయనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఐఐటీ చీఫ్ అపరేషన్ అధికారి చారు కపూర్, కార్యదర్శి నజీర్ పరస్పరం ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ రామమోహనరావు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.