• facebook
  • whatsapp
  • telegram

IIT: హైదరాబాద్‌లో 346.. తిరుపతిలో 1313

* ఐఐటీల్లో బీటెక్‌ సీఎస్‌ఈలో ప్రారంభ ర్యాంకులివీ...
* గతేడాది కంటే మెరుగుపడిన తిరుపతి

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీ హైదరాబాద్‌లో ఈసారి నాలుగేళ్ల బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సులో ఓపెన్‌ జెండర్‌ న్యూట్రల్‌ కేటగిరీలో ప్రారంభ ర్యాంకు 346. ఏపీలోని తిరుపతి ఐఐటీలో 1313  ప్రారంభ ర్యాంకు. వీటికి అన్ని కేటగిరీల బాలురు, బాలికలు పోటీపడొచ్చు. ఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో 60 సీట్లకుగాను ఓపెన్‌ న్యూట్రల్‌లో 18, తిరుపతిలో 53 సీట్లకు 17 ఓపెన్‌ న్యూట్రల్‌ సీట్లు ఉన్నాయి. గతేడాది ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో తొలి విడత సీట్ల కేటాయింపులో ప్రారంభ, ముగింపు ర్యాంకులు 191, 520. చివరి విడతకు అది 191, 521కి మారింది. ఈసారి తొలి విడతలో ప్రారంభ ర్యాంకు 346 ఉండటం గమనార్హం. దీని ప్రకారం.. ఐఐటీ హైదరాబాద్‌లో చేరే ఉత్తమ ర్యాంకర్లు కొంత తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. చివరి విడత కౌన్సెలింగ్‌ నాటికి మరికొంత మార్పు వస్తుందని అంచనా. ఐఐటీ తిరుపతిలో గతేడాది చివరి విడతలో ప్రారంభ, ముగింపు ర్యాంకులు 1682, 3441. ఈ సారి మొదటి విడతలో 1313, 3746 ప్రారంభ, ముగింపు ర్యాంకులు. తిరుపతి ఐఐటీలో ప్రవేశంపొందే ఉత్తమ ర్యాంకర్లు కొంత పెరుగుతున్నారని తెలుస్తోంది. అక్కడ సొంత ప్రాంగణం సమకూరడం, ఆచార్యుల భర్తీ పూర్తికావడంతో పరిస్థితిలో మార్పు వస్తోందని భావిస్తున్నారు. తొలి విడత ప్రవేశాల్లో ఐఐటీ హైదరాబాద్‌లో 500లోపు ర్యాంకు సాధించిన తొమ్మిది మంది, వెయ్యిలోపు ర్యాంకర్లు 33 మంది విద్యార్థులు చేరారని డైరెక్టర్‌ బి.ఎస్‌.మూర్తి తెలిపారు. 

తొలి విడతలో సీఎస్‌ఈ ప్రారంభ, ముగింపు ర్యాంకులు (ఓపెన్‌ న్యూట్రల్‌ కేటగిరీ)
 

ఐఐటీ ప్రారంభ  ముగింపు
హైదరాబాద్‌ 346 585
తిరుపతి 1313 3746
బాంబే 1 60
దిల్లీ 29 102
మద్రాస్‌ 6 167
కాన్పూర్‌ 107 236
ఖరగ్‌పూర్‌ 112 295
రూర్కెలా 271 408
గువాహటి 415 589
* వరంగల్‌ ఎన్‌ఐటీ 72 1664(హోం స్టేట్‌ కోటా కింద తెలంగాణ విద్యార్థులు)
* వరంగల్‌ ఎన్‌ఐటీ 717 1764(ఇతర రాష్ట్రాల విద్యార్థులు)
* ఏపీ ఎన్‌ఐటీ  9588 14,543(హోం స్టేట్‌ కోటా కింద ఏపీ విద్యార్థులు)
* ఏపీ ఎన్‌ఐటీ 9,066 16,039(ఇతర రాష్ట్రాల విద్యార్థులు)

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 20,000 కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు

‣ అవుతారా.. టాబ్లూ డెవ‌ల‌ప‌ర్‌!

‣ ఇంజినీర్ల‌కు సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగాలు

‣ ఆంగ్ల‌భాష ప్రావీణ్య ప‌రీక్ష ఏది ప్ర‌యోజ‌న‌క‌రం!

‣ పదేళ్లకు సరిపోయే పది ఉద్యోగ లక్షణాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.