• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరు 15 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మొదటి ఏడాది విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం వారికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్‌ పరీక్షలు అక్టోబరు 4 నుంచి 7 వరకు రెండు విడతల్లో నిర్వహిస్తారు. మార్చిలో పరీక్ష రుసుము చెల్లించని విద్యార్థులు, హాజరు మినహాయింపు పొందే ప్రైవేటు అభ్యర్థులు ఆగ‌స్టు 17లోపు పరీక్ష రుసుము చెల్లించాలి. 

Posted Date : 04-08-2021