• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 17-10-2021 (తెలుగు)

1. రహస్యంగా భూమిని చుట్టి వచ్చిన చైనా క్షిపణి

అణ్వస్త్ర సామర్థ్యమున్న ఒక సరికొత్త హైపర్‌సోనిక్‌ క్షిపణిని చైనా పరీక్షించింది. ఇది దిగువ భూ కక్ష్యలో పయనిస్తూ భూమి మొత్తాన్ని చుట్టేసింది. ఆ తర్వాత కిందకి దిగి, శరవేగంగా లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయితే ఇది కొద్దిలో గురితప్పి నిర్దేశిత లక్ష్యానికి 32 కిలోమీటర్ల దూరంలో పడింది. ఈ పరీక్ష ఆగస్టులోనే జరిగింది. కాని, చైనా దీన్ని అత్యంత గోప్యంగా ఉంచింది.  

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

2. ‘సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ లో భారత సంతతి బాలిక

భారత సంతతికి చెందిన ఆరేళ్ల ఇషానీ షణ్ముగం అద్భుతమైన జ్ఞాపకశక్తితో రికార్డు సాధించింది. గణితంలోని ‘పై’ విలువలో ఎకాఎకి 1,560 దశాంశ స్థానాలను చకచకా చెప్పేసింది. ఇదివరకు సింగపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

3. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తరుణ్‌రెడ్డికి రజతం

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీలో తెలంగాణ షట్లర్‌ కాటం తరుణ్‌ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. సిప్రస్‌ రాజధాని నికోషియాలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో తరుణ్‌ 20-22, 21-9, 11-21 తేడాతో డిమిత్రియ్‌ పనారిన్‌ (కజకిస్తాన్‌) చేతిలో పరాజయం పొందాడు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

4. పెంటగాన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా ఇండియన్‌-అమెరికన్‌ రవి చౌదరి

అమెరికాలో భారత సంతతికి చెందిన రవి చౌదరిని పెంటగాన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ పదవికి జో బైడెన్‌ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఏరోస్పేస్, రక్షణ నిపుణుడు, యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో ఉన్నత స్థానాల్లో పనిచేసిన రవి చౌదరిని. పెంటగాన్‌ అసిస్టెంట్‌ సెక్రటరీగా నియమిస్తున్నట్లు వైట్‌ హౌస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

5. ఎస్బీఐ కస్టమర్లకు ‘మల్టీ కరెన్సీ ఫారిన్‌ ట్రావెల్‌కార్డు’

దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులకు సరికొత్త ‘మల్టీ కరెన్సీ ఫారిన్‌ ట్రావెల్‌కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మల్టీపుల్‌ కరెన్సీలతో కూడిన నగదును లోడ్‌ చేసే ప్రీపెయిడ్‌ కార్డు ఇది. దీన్ని ఏటీఎం కార్డు గానూ, విదేశాల్లో మర్చంట్‌ పాయింట్స్‌లోనూ వాడొచ్చు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌
 

Posted Date : 18-10-2021