• facebook
  • whatsapp
  • telegram

Latest News: 20-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. KU Distance Exams: కేయూ దూరవిద్య పరీక్షలు మరోసారి వాయిదా

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు అధికారి డాక్టర్‌ వై.వెంకయ్య సెప్టెంబరు 19న ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. BRAOU Admissions: అంబేడ్కర్‌ వర్సిటీ సార్వత్రిక డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు 

కరీంనగర్‌ (గణేశ్‌నగర్‌), న్యూస్‌టుడే: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2021-22 విద్యా సంవత్సరం డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగించినట్లు ప్రాంతీయ సమన్వయ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. Aided Degree Colleges: ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లో భారీగా ఫీజులు!

రాష్ట్రంలో ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు గ్రాంటును నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుమారు 35వేల మంది విద్యార్థులపై ప్రభావం చూపనుంది. బోధన రుసుములకు అర్హులుకాని విద్యార్థులు రూ.వేలల్లో ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. One Day Collector: జిల్లా కలెక్టర్‌గా ఏడో తరగతి విద్యార్థిని!

బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ బాలిక ఒక రోజు కలెక్టర్‌గా విధులు నిర్వర్తించి ఐఏఎస్‌ కావాలన్న తన కోరికను నెరవేర్చుకుంది. చిన్నప్పటి నుంచి కలెక్టర్‌ కావాలన్న 11 ఏళ్ల ఫ్లోరా అసోడియా కలను మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ నెరవేర్చింది. ‘‘గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఫ్లోరా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతోంది. గతనెలలో శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...


 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 20-09-2021