• facebook
  • whatsapp
  • telegram

Latest News: 22-09-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. No Fees: అనాథ విద్యార్థులకు ఫీజు లేదు: సీబీఎస్‌ఈ

దిల్లీ: 2022లో పది, 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో కొవిడ్‌-19 కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎలాంటి రిజిస్ట్రేషన్, పరీక్ష ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. EAMCET: ఎంసెట్‌ సీటా.. ఐఐటీల వైపా?

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లో రాష్ట్రంలో పేరొందిన కళాశాలల్లో సీట్లు దక్కించుకున్నారు. మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నారు. అందులో మంచి ర్యాంకు వస్తే ఐఐటీల్లో చేరాలనే లక్ష్యంతో ఉన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. KGBV: పది కేజీబీవీల్లో ఇంటర్‌ తరగతులు

దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: మధ్యలో చదువు మానేసిన బలహీన వర్గాల సామాజిక వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఆవాస విద్య అందిస్తున్న కస్తూర్బా పాఠశాలలకు మరిన్ని సొబగులు అద్దుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 కేజీబీవీలలో ఇంటర్‌ తరగతులకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. OU Degree Results: ఓయూ డిగ్రీ చివరి సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ చివరి సెమిస్టర్‌(ఆరో సెమిస్టర్‌) ఫలితాలను సెప్టెంబరు 21న విడుదల చేశారు. 72.54శాతం ఉత్తీర్ణత నమోదైంది. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సుల్లో 67,907 మంది హాజరు కాగా.. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. KU Degree Results: కేయూ డిగ్రీ పరీక్ష ఫలితాల వెల్లడి

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం ఈ ఏడాది జులైలో నిర్వహించిన డిగ్రీ మూడు, ఐదు సెమిస్టర్ల పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. సెప్టెంబరు 21న కేయూ ఉపకులపతి ఆచార్య తాటికొండ రమేష్‌ అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6. NTR Health Versity: డెంటల్‌ పీజీ ఫలితాల విడుదల  

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పీజీ దంత వైద్య డిగ్రీ/డిప్లొమా ఫలితాలు సెప్టెంబరు 21న విడుదలయ్యాయి. మొత్తం 13 విభాగాల్లో విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో 93 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 22-09-2021