• facebook
  • whatsapp
  • telegram

Latest News: 20-10-2021 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. AP NIT: ఏపీ నిట్‌లో పెరిగిన సీట్లు

తాడేపల్లిగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: ఏపీ నిట్‌లో బీటెక్‌కు సంబంధించి 8 కోర్సులున్నాయి. గతేడాది 603 సీట్లు ఉండగా ఈ ఏడాది నుంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 150 సీట్లు అదనంగా పెరగడంతో మొత్తం సంఖ్య 753కి చేరింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. CTET: డిసెంబరు 16 నుంచి సీటెట్‌

ఈనాడు, హైదరాబాద్‌: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ నిర్వహించే 15వ ‘సెంట్రల్‌ టీచర్‌ అర్హత పరీక్ష’(సీటెట్‌) 2021 డిసెంబరు 16 నుంచి 2022 జనవరి 13 వరకూ ఆన్‌లైన్‌లో జరుగుతుందని సీటెట్‌ సంచాలకుడు అక్టోబరు 19న ఒక ప్రకటనలో తెలిపారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. CISCE: సీఐఎస్‌సీఈ 10, 12 తరగతుల తొలి సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

దిల్లీ: 2021-22 సంవత్సరానికి సంబంధించి నవంబరు 15 నుంచి జరగాల్సి ఉన్న 10, 12 తరగతుల తొలి సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు సీఐఎస్‌సీఈ అక్టోబరు 19న ప్రకటించింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. High Court: ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులపై వివరణ ఇవ్వండి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఫీజులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఫీజుల నియంత్రణకు నిర్దిష్ట యంత్రాంగం లేని కారణంగా పాఠశాలలు ఇష్టానుసారం రుసుంలు వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలంటూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్‌, కేంద్ర విద్యాశాఖ, సీబీఎస్‌ఈ, తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్‌, స్వతంత్ర పాఠశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌లకు నోటీసులు జారీచేసింది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. Results: ఎస్వీయూ ఎంబీఏ రెండో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

తిరుపతి(ఎస్వీయూ): శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీఏ రెండో సెమిస్టర్‌(సీబీసీఎస్‌-నాన్‌ సీబీసీఎస్‌) పరీక్ష ఫలితాలు అక్టోబరు 19న విడుదలయ్యాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 

Posted Date : 20-10-2021