1. డిగ్రీ, పీజీ ట్యూషన్ రుసుం చెల్లింపునకు అవకాశం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ ట్యూషన్ రుసుం చెల్లింపునకు ఆలస్య రుసుంతో అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తాం
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన స్టడీసర్కిళ్లలో శిక్షణ తీసుకుని గ్రూప్-1 మెయిన్స్‌కు ఎంపికైన 123 మంది అభ్యర్థులకు రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వీరికి ట్యాబ్‌లతో పాటు శిక్షణకాలంలో నెలకు రూ.5 వేల స్టయిపెండ్ అందజేస్తామని పేర్కొన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. బీఈడీలో 10వేల సీట్లకు కోత
రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీలో 10వేల సీట్లకు ఉన్నత విద్యాశాఖ కోత విధించింది. గతేడాది నిర్వహించిన కౌన్సెలింగ్‌లో 34,760 సీట్లు ఉండగా.. ఇప్పుడు 23,970కి తగ్గించింది. బీఈడీ కౌన్సెలింగ్ జనవరి 25న నుంచి ప్రారంభం కావడంతో కళాశాలలు, సీట్ల జాబితాను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో పెట్టింది. కళాశాలల్లో అర్హత కలిగిన అధ్యాపకులు, సౌకర్యాలు లేకపోవడంతో ఈ కోత విధించినట్లు అధికారులు తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....
4. వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీలో ఒరిజనల్ డిగ్రీ పట్టాల్లేవు
ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పేరు మార్పునకు తగ్గట్లుగా ఒరిజనల్ డిగ్రీ (ఓడీ) పట్టాలు సిద్ధం చేయనందున పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న ఎన్టీఆర్ పేరు తొలగించి... డాక్టర్ వై.ఎస్.ఆర్.పేరును చేర్చిన విషయం విదితమే.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. జేఈఈ మెయిన్‌లో ఎన్‌టీఏ నిర్లక్ష్యం.. కవలలకు శాపం
జేఈఈ మెయిన్ జరిగిన ప్రతిసారీ జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ).. విద్యార్థులను తిప్పలు పెడుతూనే ఉంది. సర్వర్లు పనిచేయక.. కంప్యూటర్లు ఆన్ కాక తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్ద గంటల తరబడి వేచిచూస్తూ ఆందోళనకు దిగిన సందర్భాలు గత రెండేళ్లుగా ఎన్నో.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.