• facebook
  • whatsapp
  • telegram

Medical College: రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది వైద్యకళాశాలలు

* ఒక్కో కళాశాలలో 100 చొప్పున ఎంబీబీఎస్‌ సీట్లు

* పరిపాలన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

 

 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2023-24 ఏడాదికి కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలలో 100 చొప్పున మొత్తం 800 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వైద్యకళాశాలల ఏర్పాటు, అనుబంధ ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌కు రూ.1,479 కోట్లు ఖర్చుచేయనుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌.ఎం.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త వైద్య కళాశాలలు.. రాజన్నసిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో రానున్నాయి. ఆయా జిల్లాల్లో వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేసేందుకు వైద్యవిద్య సంచాలకులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనల్ని పరిశీలించిన సర్కార్‌ కళాశాలల ఏర్పాటుకు అనుమతించింది. వాటికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం నిధుల్ని విడుదల చేసింది. కళాశాల ఏర్పాటుకు అవసరమైన భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, పరికరాలు, సామాగ్రి సమీకరణ బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి అప్పగించింది. వైద్యకళాశాలల అనుబంధ ఆసుపత్రుల నిర్వహణ, పరిపాలన బాధ్యతను వైద్యవిధాన పరిషత్‌ నుంచి వైద్యవిద్య సంచాలకుల పరిధిలోకి మార్చింది. వైద్యకళాశాలల ఏర్పాటుకు వీలుగా వెంటనే మౌలిక సదుపాయాల్ని కల్పించేందుకు రోడ్డు భవనాల చీఫ్‌ ఇంజినీర్‌తో కలిసి చర్యలు చేపట్టాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీని ఆదేశించింది. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.