• facebook
  • whatsapp
  • telegram

Admissions: ‘ఉపకార వేతనాన్ని తగ్గించకుంటే ప్రవేశాలు జరపొద్దు’

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విధంగా ఉపకార వేతనాన్ని పీజీ దంత వైద్య విద్యార్థులకు చెల్లించలేమని ప్రైవేట్‌ దంతవైద్య కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వార్షిక ఫీజులు తగ్గి..ఖర్చులు పెరిగినందున ఉపకార వేతనాలను చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖకు తెలియచేసింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరపలేమని పేర్కొంది. ఈ మేరకు ప్రవేశాల నోటిఫికేషన్‌లో కళాశాలల పేర్లు చేర్చొద్దని ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి లిఖితపూర్వకంగా తెలిపింది. దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటామని ఉపకులపతి శ్యాంప్రసాద్‌ తెలిపారు.

Posted Date : 24-09-2021