• facebook
  • whatsapp
  • telegram

TS SI, Constable Results: ఎస్సై, కానిస్టేబుల్‌ రాతపరీక్ష ఫలితాల వెల్లడి

46.8%, 39.96% మంది అర్హులు
27 నుంచి ‘పార్ట్‌-2’ దరఖాస్తుల స్వీకరణ

 

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయి ప్రాథమిక రాతపరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) అక్టోబ‌రు 21న‌ విడుదల చేసింది. ఎస్సై అభ్యర్థుల్లో 46.8%,  కానిస్టేబుల్‌ అభ్యర్థుల్లో 39.96% మంది తదుపరి దశకు అర్హత సాధించారు. 554 ఎస్సై, 16,321 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు ఆగస్టులో జరిగిన పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది అభ్యర్థులకు ఊరటనిచ్చే అంశమిది. తాజాగా అర్హత సాధించినవారితో పాటు, ప్రాథమిక రాతపరీక్ష అవసరం లేని ఐటీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలోని 33 ఎస్సై, 383 కానిస్టేబుల్‌, 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టుల అభ్యర్థులూ ఫిజికల్‌ టెస్టుల్లో పాల్గొననున్నారు.
 

ఆన్‌లైన్‌లోనే పార్ట్‌-2 దరఖాస్తుల స్వీకరణ
ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించి ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ) / ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ)కు హాజరుకానున్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పార్ట్‌-2 దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఈనెల 27వ తేదీ ఉదయం 8 నుంచి నవంబరు 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడువును పొడగించబోమని మండలి స్పష్టం చేసింది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పలువురు అర్హత సాధించిన నేపథ్యంలో దాదాపు 2.69 లక్షల మంది పార్ట్‌-2 దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుందని మండలి వర్గాలు వెల్లడించాయి. ఈ దరఖాస్తుల స్వీకరణ అనంతరం పీఎంటీ, పీఈటీల వేదికలు, తేదీల గురించి అభ్యర్థులకు వెబ్‌సైట్‌ ద్వారా ఇంటిమేషన్‌ లెటర్లు పంపించనన్నుట్లు తెలిపాయి.
 ప్రాథమిక రాతపరీక్షకు సంబంధించిన తుది ‘కీ’ని, మూల్యాంకనం చేసిన ఓఎంఆర్‌ షీట్లనూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్‌ ఐడీలతో వాటిని చూసుకోవచ్చని మండలి వర్గాలు వెల్లడించాయి.
 

ఎస్సై పోస్టుల్లో ఎస్టీ అభ్యర్థుల ముందంజ
ఎస్సై పోస్టులకు సంబంధించి సగటు మార్కులు 47.25గా తేలింది. మొత్తం 200 మార్కులకు గాను మొదటిస్థానంలో నిలిచిన అభ్యర్థికి 133 మార్కులు వచ్చాయి. ఎక్కువ మంది సాధించిన మోడల్‌ మార్కు 36.80 కాగా 2,176 మంది ఈ మార్కులు సాధించారు.
 కేటగిరీల వారీగా.. అత్యధికంగా ఎస్టీ అభ్యర్థులు 59.12 శాతం ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఎస్సీ అభ్యర్థులు 54.45%, మాజీ సైనికోద్యోగులు 49.12%, బీసీలు 42.06%, ఓసీలు 33.21% అర్హత సాధించారు. పురుషుల్లో 49.8%, మహిళా అభ్యర్థుల్లో 37.02% మంది అర్హులుగా నిలిచారు.
 కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సంబంధించి సగటు మార్కులు 41.16గా వెల్లడైంది. మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థికి 141 మార్కులు వచ్చాయి. మోడల్‌ మార్కులను (33.2) 7,518 మంది సాధించారు.
 కేటగిరీల వారీగా అభ్యర్థుల్లో.. మాజీ సైనికోద్యోగులు అత్యధికంగా 54.25% అర్హత సాధించారు. ఎస్సీలు 39.43%, ఎస్టీలు 37.97%, బీసీలు 27.1%, ఓసీలు 24.43% మంది అర్హులయ్యారు.
 పురుషుల్లో 32.56%, మహిళా అభ్యర్థుల్లో 28.35% అర్హత సాధించారు.

 

వెబ్‌సైట్‌

ప్రకటన

 

********************************************************

స్టడీ మెటీరియ‌ల్‌ - మెయిన్స్

‣ పేపర్ - 1: ఇంగ్లిషు
‣ పేపర్ : 2: తెలుగు
‣ పేపర్ - 3: అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ
 పేపర్ - 4: జనరల్ స్టడీస్

 

‣ పాత ప్రశ్నప‌త్రాలు

‣ నమూనా ప్రశ్నపత్రాలు

********************************************************

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-10-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.