• facebook
  • whatsapp
  • telegram

టీఎస్ పీజీఈసెట్ అడ్మిట్ కార్డులు విడుద‌ల‌

 

తెలంగాణ స్టేట్‌ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్ట్‌(టీఎస్ పీజీఈసెట్‌)-2021 అడ్మిట్ కార్డుల‌ను తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి విడుద‌ల చేసింది. ప‌రీక్ష ఆగ‌స్టు 11 నుంచి 14 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు అడ్మిట్ కార్డుల‌ను టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. రూ.500 ఆల‌స్య రుసుముతో ఆగ‌స్టు 8 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంది. ప‌రీక్ష కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ప‌ద్ధతిలో నిర్వ‌హిస్తారు. దీని ద్వారా 2021-22 విద్యాసంవ‌త్సరానికి సంబంధించి రాష్ట్రంలోని కళాశాల‌ల్లో పీజీ కోర్సులైన‌ ఇంజినీరింగ్‌, టెక్నాల‌జీ, ఆర్కిటెక్చ‌ర్‌, ఫార్మ‌సీ(ఎంఈ/ ఎంటెక్‌/  ఎంఫార్మా/ ఎంఆర్క్‌)తోపాటు ఫార్మ్-డి కోర్సులోనూ ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు. పీజీఈసెట్‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి త‌ర‌ఫున ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం నిర్వ‌హిస్తోంది. ప‌రీక్ష కేంద్రాలు హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్‌లో ఉన్నాయి. 

వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in/

Posted Date : 05-08-2021