• facebook
  • whatsapp
  • telegram

IIT: ఐఐటీల్లో దక్షిణాది అమ్మాయిలే అధికం

* వారిలో తెలుగు రాష్ట్రాల వారిదే అగ్రస్థానం

* జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2021 నివేదికలో ఐఐటీ ఖరగ్‌పుర్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు ఐఐటీల్లో అధిక సీట్లు సాధించి ముందంజలో నిలిచారు. 2021-22లో దేశంలోని 23 ఐఐటీల్లో 3,228 మంది విద్యార్థినులు సీట్లు పొందగా, అందులో హైదరాబాద్‌ ఐఐటీ జోన్‌ పరిధిలోని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల వారు 846 మంది(26%) ఉన్నారని ఐఐటీ ఖరగ్‌పుర్‌ తాజాగా విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2021 నివేదిక వెల్లడించింది. ఆ ప్రకారం గత అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 1,41,699 మంది రాశారు. అందులో 41,862 మంది జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొని ఐఐటీలో సీట్లు పొందేందుకు అర్హత సాధించారు. అందులో 6,452 మంది అమ్మాయిలుకాగా, వారిలో 3,228 మంది సీట్లు పొందారు. వారిలో 846 మంది తెలంగాణ, ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల వారు. అందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 80 శాతానికిపైగా(676 మంది) ఉంటారని జేఈఈ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ‘‘ఐఐటీ ఖరగ్‌పుర్‌ పరిధిలోనే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అక్కడ రాసిన వారిలో కనీసం 70-100 మంది ఎంపికవుతారు. వారినీ కలుపుకొంటే ఐఐటీలలో తెలుగు రాష్ట్రాల అమ్మాయిల సంఖ్య 750కి తగ్గదని’’ వారు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అమ్మాయిలు ఇంజినీరింగ్‌పై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తమిళనాడు, కేరళలో జేఈఈ కంటే నీట్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తుంటారు. ఐఐటీలలో తెలుగు రాష్ట్రాల విద్యార్థినుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి ఇది కూడా కారణమని’’ నానో అకాడమీ డైరెక్టర్‌ కృష్ణ చైతన్య చెప్పారు.

నివేదిక ముఖ్యాంశాలు ఇవీ...

* అబ్బాయిలు పొందిన మొత్తం సీట్లలో హైదరాబాద్‌ జోన్‌ వారు 17 శాతం (2,254) కైవసం కేసుకున్నారు

*  జోసా కౌన్సెలింగ్‌కు మొత్తంగా 41,862 మంది అర్హత సాధించగా, హైదరాబాద్‌ జోన్‌ నుంచే 7,685 మంది ఉన్నారు. అత్యధికంగా దిల్లీ జోన్‌ నుంచి 8,142 మంది అర్హత పొందారు.

*  అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1,51,193 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో అత్యధికంగా 32,558 మంది హైదరాబాద్‌ జోన్‌ విద్యార్థులే.

నోట్‌: పరీక్ష కేంద్రాల పరంగా ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను హైదరాబాద్‌ ఐఐటీ జోన్‌ పరిధిలో చూపుతున్నారు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్న్‌షిప్‌ చేసేముందు ఇవి చూసుకోండి!

‣ ఆన్‌లైన్‌లో లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

‣ ఎంపీసీ తర్వాత ఏం చేయవచ్చు?

‣ పొరుగుతో శాంతి నెలకొంటుందా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.