• facebook
  • whatsapp
  • telegram

VIT: 19 నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు

* మే 3న ఫలితాలు విడుదల

వడపళని, న్యూస్‌టుడే: వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో బీటెక్‌ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. ఏప్రిల్‌ 19 నుంచి 30వరకు వీఐటీ వేలూరు, చెన్నై, ఏపీ(అమరావతి), భోపాల్‌లో పరీక్షలుంటాయని సంస్థ ఏప్రిల్‌ 18న ఒక ప్రకటనలో పేర్కొంది. దేశవ్యాప్తంగా 125 నగరాలతోపాటు దుబాయి, మస్కట్, ఖతార్‌, కువైట్, సింగపూర్‌, కౌలాలంపూర్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కావచ్చని స్పష్టం చేసింది.

మే3న ఫలితాలు: మే 3న www.vit.ac.in వెబ్సైట్లో ఫలితాలు విడుదల చేసి.. అదేరోజు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ ప్రారంభిస్తారు. లక్షలోపు ర్యాంకున్నవారు కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. తమిళనాడు, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోని టాపర్లు, మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారికి(ఒక విద్యార్థి, ఒక విద్యార్థినికి) వందశాతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ‘సపోర్ట్‌ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్‌ రూరల్‌ స్టూడెంట్స్’ (ఎస్‌టీఏఆర్‌ఎస్‌) పథకం కింద హాస్టల్‌ మెస్‌లోనూ మినహాయింపు ఉంటుందని సంస్థ పేర్కొంది.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

‣ ఎన్‌ఐఎన్‌ కోర్సులతో మెరుగైన అవకాశాలు

‣ నిర్ణయాలు తీసుకునేముందు..

‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.